Home /News /telangana /

MONEY RE COLLECTED FROM DIAGNOSTIC CENTRE WHO COLLECTED ADDITIONAL FEESES FOR COVID TESTS BY MLA VINAY BHASKAR VRY

Diagnostic centre : కరోనా టెస్టుకు అధిక డబ్బులు ..తిరిగి ఇప్పించిన ఎమ్మెల్యే

కరోనా టెస్టుకు అధిక డబ్బులు ..తిరిగి ఇప్పించిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్

కరోనా టెస్టుకు అధిక డబ్బులు ..తిరిగి ఇప్పించిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్

Warangal :ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న హన్మకొండలోని ఓ ప్రైవేటు డయాగ్నిస్టిక్ సెంటర్‌లో భాదితులకు డబ్బులు తిరిగి ఇప్పించిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. అధిక ఫీజుల పై ఫిర్యాదు చేయాలని సూచన.

కరోనాతో దేశ వ్యాప్తంగా ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుజీవుడా అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అయితే రోగుల బలహీనతను ఆసరా చేసుకుంటున్న ఆసుపత్రులలతో పాటు రోగ నిర్థారణ చేసే డయాగ్నస్టిక్ సెంటర్‌ల దోపిడికి తెర తీశాయి. అందినకాడికి దండుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటమడుతున్నాయి.

అయితే ఇలాంటీ ఆగడాలకు చెక్ పెట్టేందుకు అటు ప్రభుత్వ అధికారులు ఇటు ప్రజా ప్రతినిధులు రంగంలోకి దిగారు. ఇప్పటికే కొవిడ్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు పోలీసులు రంగప్రవేశం చేశారు. ముందుగా కరోనా చికిత్సకు అధిక ఫీజుల వసూలు చేస్తున్న వారిపై కొరడా ఝలిపిస్తున్నారు.మరోవైపు మంత్రి కేటిఆర్ సైతం ఆసుపత్రుల్లో అధిక చార్జీలపై దృష్టి సారించారు. ట్విట్టర్ ద్వార తన దృష్టికి వచ్చిన సమస్యలపై వెంటనే అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.దీంతో రాష్ట్రంలోని పలువురు ఎమ్మెల్యేలు ఇదే బాటపట్టారు.

ఈ నేపథ్యంలోనే వరంగల్ అర్బన్ జిల్లాలోని హన్మకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కరోనా రోగుల పక్షాన నిలబడ్డారు. నగరంలోని విజయ డయాగ్నోసిస్ సెంటర్‌లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలకు గాను అధిక డబ్బులు వసూలు చేస్తున్న విషయం తెలుసుకుని, నేరుగా ఆ సెంటర్‌కు వెళ్లారు. ఆయన వెంట వైద్య అధికారులతో పాటు పోలీసు అధికారును తీసుకెళ్లారు. వెంటనే బాధితుల వద్ద తీసుకున్న డబ్బుల వివరాలపై ఆరా తీశారు.

సీటి స్కానింగ్ కోసం ప్రభుత్వం 2500 రూపాయలను నిర్ధారించగా స్థానిక విజయా డయాగ్నాసిస్ సెంటర్ మాత్రం 5000 రూపాయలు తీసుకున్నట్టు గుర్తించారు.. దీంతో యాజమాన్యంతో మాట్లాడిన ఎమ్మెల్యే అధిక కరోనా భాదితుల వద్ద వసూలు చేసిన అధిక డబ్బులను తిరిగి ఇప్పించారు. మరోవైపు ఆసుపత్రుల్లో సైతం అధిక ధరలు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఓ నెంబర్ ‌కూడ విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే ప్రభుత్వ నెంబర్స్‌తో పాటు తన నెంబర్‌9849766789 కూడ ఇచ్చారు.

కాగా సీటి స్కానింగ్‌కు ఫిల్మ్ తో అయితే 2500 లేదంటే 2000 రూపాయలు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాని కరోనా భాదితుల అవసరాలను అసరా చేసుకుంటున్న పలు సెంటర్లు అధిక ఫీజులు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే..
Published by:yveerash yveerash
First published:

Tags: Corona cases, Private hospitals, Warangal

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు