హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad theft :పూజ ముందు పెట్టిన డబ్బులు మాయం.. రెండున్నర లక్షలను బాత్రూం కమోడ్‌లో వేసి ఫ్లష్ నొక్కాడు...

Hyderabad theft :పూజ ముందు పెట్టిన డబ్బులు మాయం.. రెండున్నర లక్షలను బాత్రూం కమోడ్‌లో వేసి ఫ్లష్ నొక్కాడు...

Hyderabad theft :పూజ ముందు పెట్టిన డబ్బులు మాయం.. లక్షలను బాత్రూం కమోడ్‌లో వేసి ఫ్లష్ నొక్కాడు..

Hyderabad theft :పూజ ముందు పెట్టిన డబ్బులు మాయం.. లక్షలను బాత్రూం కమోడ్‌లో వేసి ఫ్లష్ నొక్కాడు..

Hyderabad theft : డబ్బులు దొంగిలించి పట్టుపడతామన్న భయంతో రెండు లక్షలను నీళ్లపాలు చేశాడు..బాత్రుంలోవేసి ఫ్లష్‌ నొక్కాడు.... కేటరింగ్ కోసం వచ్చి దొంగతనానికి పాల్పడిన సంఘటన జూబ్లీహిల్స్‌‌లో చోటు చేసుకుంది.

ఇంట్లో కాటరింగ్ కోసం వచ్చాడు.. దేవుడి ముందు పెట్టిన డబ్బును దొంగిలించాడు.. అయితే అప్రమత్తమైన ఆ ఇంటి యజమాని అనుమానంతో ఇంట్లో ఉన్న వారిని తనిఖీలు చేస్తుండడంతో భయపడిన ఆ వ్యక్తి దొంగిలించిన డబ్బును ఇంట్లో ఉన్న బాత్రుంలోకి వెళ్లి కమోడ్‌లో వేశాడు అనంతరం ఫ్లష్ నొక్కడంతో ఆ డబ్బు సెఫ్టిక్ ట్యాంక్ పాలు అయింది..

వివరాల్లోకి వెళితే..జూబ్లీహిల్స్‌లో నివాసం ఉండే ప్రకాశ్ చంద్ జైన్ దీపావళీకి సంబంధించి ఇంట్లో పూజలు నిర్వహించారు. అయితే పూజలో భాగంగా దేవుడి ముందు మూడున్నర లక్షల రూపాయలను ఉంచాడు. అనంతరం పూజ కార్యక్రామాలు నిర్వహించాడు. ఘనంగా అందరిని పిలిచి సాయంత్రం పూట పూజలు నిర్వహించారు. వచ్చిన వారికి భోజనాలు పెట్టేందుకు కేటరింగ్ వారికి ఆర్డర్ ఇచ్చాడు. అయితే పూజా కార్యక్రమాలు అయిన పోయిన తర్వాత అందరికి భోజనాలు వడ్డించారు. బంధువులకు అన్ని మర్యాదలు చేసి భోజనాలు పెట్టిన తర్వతా వారిని పంపించేందుకు పది నిమిషాలు బయటకు వచ్చాడు.

ఇది చదవండి : కంత్రీ ఫాదర్... నెల రోజుల పసిగుడ్డును నేలకేసి కొట్టాడు.. బండరాయితో బాదాడు.. కారణం ఇదే...


అయితే.. పూజ ముందు పెట్టిన మూడున్నర లక్షల మీద కేటరింగ్ సప్లై కోసం వచ్చిన షేక్ చాంద్ రజాక్ కన్ను పడింది. ప్రకాశ్ చంద్ జైన్ బయటికి వెళ్లడంతో ఇంట్లో ఎవరు లేకపోవడం గమనించిన రజాక్ మూడున్నర లక్షలను దొంగిలించాడు... ఇంతమంది హడావిడిలో యజమాని గమనించడని బావించాడు.. అయితే రజాక్ ఆలోచన తలకిందులైంది. దీంతో బయటికి వెళ్లి వచ్చిన ప్రకాశ్ జైన్ వెంటనే పూజ ముందు ఉంచిన నోట్ల కట్టలు కనిపించక పోవడంతో కంగారు పడ్డాడు. వెంటనే ఆ డబ్బులు దొంగతనానికి గురయ్యాయని గుర్తించాడు..

 ఇది చదవండి : గంజాయి స్మగ్లర్స్‌గా ఇద్దరు కానిస్టేబుల్స్.. జైల్లో ఉన్న స్మగ్లర్స్‌తో లింక్‌..


అనుమానంతో ఇంట్లో వెతుకున్న ప్రకాశ్ జైన్ అందరిని తనిఖీ చేస్తుండడంతో తాన జేబులో ఉన్న డబ్బు ఎక్కడ బయటపడుతుందోనని భయంతో వెంటన తన దగ్గర డబ్బులోనుండి రెండున్నర లక్షలను బాత్రుంలోకి వెళ్లి కమోడ్‌లో పడేశాడు. అనంతరం ఫ్లష్ నొక్కి నీళ్లపాలు చేశాడు.. ఇక డెబ్బై అయిదు వేల రూపాయలను తన జేబులో ఉంచుకున్నాడు. అయితే తనిఖీల్లో 75 వేల రూపాయలు బయటపడడడంతో మిగతా డబ్బుల కోసం ఆరా తీశాడు. దీంతో బాత్రుంలో వేశానని చెప్పడంతో .. అక్కడికి వెళ్లి వెతికారు.. అయితే అప్పటికే డ్రైనైజీ పాలుకాగా రెండు మూడు నోట్లు తేలియాడుతూ కనిపించాయి. దీంతో ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రజాక్‌ను అదుపులోకి తీసుకున్నారు.

First published:

Tags: Hyderabad, Theft