రైతులకు ఎప్పుడు ఎలాంటీ కష్టాలు వస్తాయో ఉహించకుండా ఉంటాయి..ముఖ్యంగా పంట వేసే నాటినుండి అమ్మెవరకు అనేక కష్టాలు పట్టిపీడిస్తాయి..పంట వేసే సయయంలో వాతవరణం సహకరించక పోవడం, తీర పంటలు పండినా ఒక్కొసారి అనావృష్టి , లేదంటే అతివృష్టితో పంటలు దెబ్బతింటాయి..ఇక పంట చేతికి వచ్చిన తర్వాత కూడా ధరలు లేక తమ పంటలను తామే కాలబెట్టుకునే దీన స్థితిని రైతు ఎదుర్కొంటాడు.
అయితే ఇవన్ని ఓ ఎత్తైతే..పూర్తిగా పంటలు అమ్మిన తర్వాత అప్పులు తీర్చడంతో పాటు పెట్టుబడి కోసం దేవుడి వద్వ పెట్టుకున్నసొమ్ము బుడిదపాలు అయింది. తాను నమ్ముకున్న దైవమే పిల్లి రూపంలో వచ్చి రైతన్నను కాటేసింది. దీంతో ఇంట్లో పెట్టుకున్న లక్ష రూపాయలు మంటల్లో కలిసిపోయాయి.
వివరాల్లోకి వెళితే..జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం నందిన్నెకు చెందిన రైతు తెలుగు వీరేష్ తన పంట అమ్మిగ వచ్చిన లక్ష రూపాయలను బ్యాంకు నుండి గత శనివారమే తీసుకువచ్చి ఇంట్లో పెట్టాడు. అయితే తన గుడిసే కావడంతో ఓ డబ్బాలో చుట్టి పెట్టాడు. కాగా సోమవారం నాడు ఇంట్లో పూజ చేసి దేవుడికి దీపం ముట్టించాడు. ఈ క్రమంలోనే ఓ పిల్లి పూజవద్దకు వచ్చి తాను ముట్టించిన దీపాన్ని కింద పడేయడంతో ఒక్కసారిగా అందులో నూనేతో మంటలు చెలరేగాయి. గుడిసెలో మంటలు వ్యాపించాయి. మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ...ప్రయోజనం లేకపోయింది. ఇంతలోపే అక్కడ పెట్టిన డబ్బులు కూడా బుడిదయ్యాయి. ఎంత ప్రయత్నం చేసినా..డబ్బులు కాపాడలేకపోయానని..నెలల తరబడి కష్టపడి పంట పండించిన రైతుకు డబ్బులు కాలిపోవడంతో లబోదిబోమని మొత్తుకున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fire Accident, Gadwal