అనాధల పాలిట ఆపద్భాందవుడు.. సెల్యూట్ టు హెడ్ కానిస్టేబుల్ మోహన్

త‌నతో పాటు ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో ఉన్న ప‌ది మంది స్నేహితులు నెల‌కు రూ.1000 చొప్పున ఆశ్ర‌మ‌ం ఖ‌ర్చుల‌కు విరాళం ఇస్తున్న‌ామని మోహ‌న్ తెలిపారు.

news18-telugu
Updated: October 23, 2020, 4:19 PM IST
అనాధల పాలిట ఆపద్భాందవుడు.. సెల్యూట్ టు హెడ్ కానిస్టేబుల్ మోహన్
మోహన్ (File)
  • Share this:
(పి.మ‌హేంద‌ర్, న్యూస్18 తెలుగు, నిజామాబాద్)

అనాధ‌ల పాలిట ఆప‌ద్బాంధువుడ‌య్యాడు ఓ పోలీస్ కానిస్టేబుల్. సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌తో పాటు వృద్దుల కోసం ప్ర‌త్యేక ఆశ్ర‌మాన్ని ఏర్పాటు చేసాడు. చివ‌రి మ‌జిలిలో పండుటాకుల‌ను క‌న్నవారిలా చూసుకుంటున్నాడు. అటు శాంతి భ‌ద్ర‌త ప‌రిర‌క్ష‌ణ‌తో పాటు సామాజిక సేవ‌లోనూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్న‌ కానిస్టేబుల్ ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. నిజామాబాద్ జిల్లా వ‌ర్ని మండ‌లం చింత‌కుంట గ్రామానికి చెందిన మోహ‌న్ 2001లో పోలీసు ఉద్యోగంలో చేరాడు. చిన్న‌ప్ప‌టి నుంచి సామాజిక స్పృహపై అవ‌గాహ‌న పెంచుకున్న ఆయ‌న త‌న‌వంతు బాధ్యత‌గా సమాజానికి ఏదో ఒక‌టి చేయాల‌ని ప‌రిత‌పించాడు. ఇందులో భాగంగా 2002లో చింత‌కుంట సేవా స‌మితి అనే స్వ‌చ్ఛంద సంస్థ‌ను నెల‌కొల్పాడు. గ్రామంలో విద్య, వైద్యం, పారిశుధ్యం, ప‌ర్యావ‌ర‌ణం త‌దిత‌ర ఆంశాల‌పై కార్య‌క్ర‌మాలు, అవ‌గాహ‌న స‌ద‌స్సులు ఏర్పాటు చేశాడు. అటు పోలీసుగా వృత్తి ధర్మాన్ని నెర‌వేరుస్తూనే... గ్రామీణ ప్రాంతా క్రీడాకారుల‌కు క్రీడా సామాగ్రి, ఉత్త‌మ ప్ర‌తిభ క‌లిగిన విద్యార్థుల‌కు న‌గ‌దు పారితోషికం అందిస్తూ వారిని ప్రోత్స‌హిస్తున్నాడు. గ్రామంలో ప‌ది మంది త‌న చిన్న‌నాటి స్నేహితుల స‌హ‌కారంతో సామాజిక సేవ‌లు నిర్వ‌హిస్తున్నాడు.

ప్ర‌తియేటా వేస‌విలో చ‌లివేంద్రాలు, వ‌డ‌దెబ్బ నివార‌ణ మందుల‌ను పంపిణీ చేస్తున్నాడు. వ‌ర్ని, బీర్కూర్, బాన్సువాడ మండలాల్లో వెనుక‌బడిన 50 గ్రామాల‌ను గుర్తించి అక్క‌డి పేద‌ విద్యార్థుల‌కు ఉచితంగా పుస్తకాలు, స్కూల్ యూనిఫాం లు అంద‌జేస్తున్నాడు. 15 మంది ఆనాధ పిల్ల‌ల‌కు ఆర్థిక స‌హ‌యం అందిస్తున్నాడు.

మోహన్ నిర్వహిస్తున్న అనాధ వృద్ధాశ్రమం


విధి నిర్వ‌హ‌ణ‌లో ఉండగా ఓ ఆనాధ వృద్ధురాలు ద‌య‌నీయ ప‌రిస్థితి చూసి చ‌లించిపోయిన మోహ‌న్ ఇలాంటి అభాగ్యుల‌కు ఆశ్ర‌యం క‌ల్పించాల‌ని సంక‌ల్పించాడు. 2013లో చింతకుంట శివారులో వృద్దుల కోసం ప్ర‌త్యేక ఆశ్ర‌మాన్ని ఏర్ప‌ాటు చేసాడు. 20మందికి ఆశ్ర‌యం క‌ల్పిస్తున్నాడు. ఇందులో కొంద‌రు ఏవ‌రూలేని ఆనాధ‌లు కాగా మ‌రి కొంద‌రు అయిన‌వాళ్లు ఉన్నప్ప‌టికి వారు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో బ‌య‌ట‌కు వ‌చ్చిన వారు ఉన్నారు.

అనాధ పిల్లలకు చదువు కోసం సాయం చేస్తున్న మోహన్


వీరికి మూడు పూట‌లా భోజ‌నం అందిస్తూ వైద్య, ఆరోగ్య పరీక్ష‌లు నిర్వ‌హిస్తూ వారి బాగోగులు చూసుకుంటున్నాడు. వృద్దాశ్రమం కోస‌ం గ్రామ‌ క‌మిటీ ఎక‌రం భూమిని విరాళంగా ఇచ్చింది. దాతల‌ స‌హ‌కారంతో భ‌వనాన్ని కూడా నిర్మించారు.

మోహన్ చేస్తున్న సామాజిక సేవకు ఉన్నతాధికారుల అభినందన


మోహన్ సేవా కార్య‌క్ర‌మాల‌ను గుర్తించిన పోలీస్ శాఖ ఉత్త‌మ సామాజిక కార్య‌క‌ర్త‌గా ఎంపిక చేసింది. గ‌తంలో లోక్ స‌త్తా నేత జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ‌, మాజీ సీబీఐ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ వంటి ప్ర‌ముఖులు ఈ ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించారు.

వృద్ధాశ్రమంలో ఉండే వారికి వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారు


మ‌రోవైపు జిల్లా యంత్రాంగం కూడా మోహ‌న్ కు న‌గ‌దు పారితోషికం ప్ర‌శంసాప‌త్రాన్ని అందించింది. ఎక్క‌డైనా ఆనాధ‌లు, కొడుకులు, కూతుళ్లు ఇంట్లోంచి గెంటేసిన వృద్దులు ఉంటే త‌మ ఆశ్ర‌మంలో చేర‌దీస్తామ‌ని ఆయ‌న చెప్తున్నాడు.

అనాధ వృద్ధాశ్రమంలోని వారితో మోహన్


త‌నతో పాటు ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో ఉన్న ప‌ది మంది స్నేహితులు నెల‌కు రూ.1000 చొప్పున ఆశ్ర‌మ‌ం ఖ‌ర్చుల‌కు విరాళం ఇస్తున్న‌ామని మోహ‌న్ తెలిపారు. త‌మ‌ను ఆశ్రమంలో క‌న్న త‌ల్లిదండ్రుల్లాగా చూసుకుంటున్నాన‌డ‌ని వృద్దులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 23, 2020, 4:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading