హోమ్ /వార్తలు /తెలంగాణ /

హైదరాబాద్‌లో ఈనెల 12న గణేష్ నిమజ్జనం... ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ చీఫ్

హైదరాబాద్‌లో ఈనెల 12న గణేష్ నిమజ్జనం... ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ చీఫ్

బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం అనంతరం ఈ నెల 12న ఉదయం 8 గంటలకు శోభాయాత్రను ప్రారంభించనున్నట్టు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ తెలిపింది.

    భాగ్యనగరంలో గణేష్ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. గల్లీకో వినాయకుడు కొలువుతీరి పూజలందుకుంటున్నాడు. హైదరాబాద్‌లో ఎక్కడా చూసినా గణేష్ మండపాలే దర్శనమిస్తున్నాయి. అయితే నగరంలో గణేశ్ శోభాయాత్రకు ముహూర్తం ఖరారైంది. బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం అనంతరం ఈ నెల 12న ఉదయం 8 గంటలకు శోభాయాత్రను ప్రారంభించనున్నట్టు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ తెలిపింది. ఈ కార్యక్రమానికి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నట్లు సమితి సభ్యులు తెలిపారు. ఆయనతో పాటు స్వామి ప్రజ్ఞానంద శోభాయాత్రలో పాల్గొంటారని తెలిపింది.

    బాలాపూర్ లడ్డూ వేలం తర్వాత ప్రారంభమయ్యే శోభాయాత్ర చాంద్రాయణగుట్ట, శాలిబండ, చార్మినార్‌ మీదుగా కొనసాగనుంది. అయితే శోభాయాత్రలో డీజేలు, సినిమా పాటలు, అసభ్యకర  డాన్సులు చేయవద్దని ఉత్సవ కమిటీ సభ్యులు ఆదేశించారు. దేశభక్తి,  దైవభక్తి పెంపొందించేలా భజనలు, కీర్తనలు, హరికథలు, బుర్ర కథలు ఏర్పాటు చేయాలన్నారు.  ప్రతీ ఏడాది ఓ థీమ్ పెట్టుకుంటున్నట్టుగానే ఈసారి జలియన్‌ వాలాబాగ్‌లో జరిగిన ఘటనను మననం చేసుకుంటూ ఊరేగింపు సాగాలన్నారు. ఈసారి హైదరాబాద్‌లో జరిగే గణేష్ శోభాయాత్రకు 40 లక్షల మంది రావచ్చని అంచాన వేస్తున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కూడా గట్టి బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నారు.

    First published:

    Tags: Ganesh Chaturthi 2019, Ganesh immersion, Hyderabad, Telangana, Vinayaka Chavithi

    ఉత్తమ కథలు