తుఫాన్ ఎఫెక్ట్ : రాబోయే మూడు రోజులు తెలంగాణలో ఒక మోస్తరు వర్షాలు

సోమవారం నాటికి తుఫాన్ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు.తుఫాన్ ప్రయాణ దిశపై సోమవారం నాటికి క్లారిటీ వస్తుందని చెప్పారు.

news18-telugu
Updated: April 29, 2019, 7:56 AM IST
తుఫాన్ ఎఫెక్ట్ : రాబోయే మూడు రోజులు తెలంగాణలో ఒక మోస్తరు వర్షాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వచ్చే మూడు రోజులు తెలంగాణలో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షం కురవని చోట వడగాల్పులు వీస్తాయని, ఉష్ణోగ్రతలు అధిక స్థాయికి చేరుకుంటాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్ప పీడనం తుఫాన్‌గా మారి ఆదివారం మధ్యాహ్నానికి మచిలీపట్నం తీరానికి దక్షిణ ఆగ్నేయ దిశగా 1230కి.మీ దైరంలో కేంద్రీకృతమై ఉంది. సోమవారం నాటికి తుఫాన్ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు.తుఫాన్ ప్రయాణ దిశపై సోమవారం నాటికి క్లారిటీ వస్తుందని చెప్పారు. తుఫాన్ ప్రభావం తెలంగాణ కంటే కోస్తాంధ్రపై ఎక్కువగా ఉంటుందని తెలిపారు. మంగళవారం వాతావరణం చల్లబడి కోస్తాంధ్రలో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

First published: April 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు