మావోయిస్టు కేంద్ర కమిటీలో తెలంగాణకు అత్యధిక ప్రాధాన్యత

21 మంది సభ్యులతో నూతన కేంద్రకమిటీ ఏర్పాటైంది. కమిటీలో తెలంగాణకు చెందిన 10మంది, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు నియమితులయ్యారు.

news18-telugu
Updated: January 31, 2020, 9:35 PM IST
మావోయిస్టు కేంద్ర కమిటీలో తెలంగాణకు అత్యధిక ప్రాధాన్యత
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మావోయిస్ట్ కేంద్ర కమిటీలో భారీగా సంస్థాగత మార్పులు జరిగాయి. మావోయిస్ట్ పార్టీ కేంద్రకమిటీ కార్యదర్శిగా నంబాల కేశవరావు అలియాస్ దేవరాజ్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి కావడంతో కేంద్ర కమిటీలో భారీ ప్రక్షాళన చేపట్టారు. 21 మంది సభ్యులతో నూతన కేంద్రకమిటీ ఏర్పాటైంది. కమిటీలో తెలంగాణా కు చెందిన 10మంది, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు, జార్ఖండ్ నుంచి నలుగురు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ నుంచి ఇద్దరు, ఇద్దరు... బీహార్ నుంచి ఒకరికి అవకాశం కల్పించారు.

 

తెలంగాణ నుంచి 10మంది సభ్యులు

1. ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి (కరీంనగర్)

2. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ వివేక్ (కరీంనగర్)

3. కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ (ఆదిలాబాద్)

4. మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ (కరీంనగర్)5. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ (కరీంనగర్)

6. కడారి సత్యనారాయణ అలియాస్ కోసా (కరీంనగర్)

7. మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్ (హైదరాబాద్)

8. పుల్లూరి ప్రసాద రావు అలియాస్ చంద్రన్న (కరీంనగర్)

9. గాజర్ల రవి అలియాస్ గణేష్ (వరంగల్)

10. పాక హనుమంతు అలియాస్ ఊకే గణేష్ (నల్లగొండ)

ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రకమిటీ కార్యదర్శిగా నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్

అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే
First published: January 31, 2020, 9:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading