Home /News /telangana /

MNR PG STUDENTS REQUEST INDIAN MEDICAL ASSOCIATION FOR JUSTICE IN HYDERABAD AK

PG Students: మాకు న్యాయం చేయండి.. ఐఎంఎను కలిసిన ఎంఎన్ఆర్ పీజీ విద్యార్థులు..

IMA బంజారాహిల్స్ అధ్యక్షుడికి వినతి పత్రం అందిస్తున్న పీజీ విద్యార్థులు

IMA బంజారాహిల్స్ అధ్యక్షుడికి వినతి పత్రం అందిస్తున్న పీజీ విద్యార్థులు

MNR Students IMA: కొద్దినెలల క్రితం ఎన్ఎంసీ మార్గదర్శకాలు పాటించనందున మూడు కాలేజీల గుర్తింపును రద్దు చేశారు. దీంతో75 పీజీ విద్యార్థులు రోడ్డున పడ్డామని విద్యార్థులు ఆందోళన చేశారు.

    హెల్త్ యూనివర్సిటీ నిర్లక్ష్యంగా కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని పలువురు ఎంఎన్ఆర్ పీజీ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దినెలల క్రితం ఎన్ఎంసీ(National Medical Council) మార్గదర్శకాలు పాటించనందున మూడు కాలేజీల గుర్తింపును రద్దు చేశారు. దీంతో75 పీజీ విద్యార్థులు రోడ్డున పడ్డామని విద్యార్థులు ఆందోళన చేశారు. ఈ విషయంలో యూనివర్సిటీ వైఎస్ ఛాన్సలర్, ఆరోగ్యశాఖ మంత్రిని కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ బంజార్‌హిల్స్‌ ఐఎంఎ అధ్యక్షుడు ప్రభు కుమార్‌కు వినతి పత్రం అందించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ప్రభు కుమార్ తెలిపారు.

    కొద్దిరోజుల క్రితం సంగారెడ్డిలోని(Sangareddy) ఎంఎన్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీలో పీజీ కోర్సుల గుర్తింపును జాతీయ వైద్య మండలి రద్దు చేసింది. అధ్యాపకుల కొరత, మౌలిక సదుపాయాల లేమి కారణంగానే పీజీ కోర్సుల గుర్తింపును రద్దు చేసినట్లు సమాచారం. దీంతో మొత్తం 21 విభాగాలకు చెందిన 80 పీజీ సీట్లను ఎంఎన్‌ఆర్‌ కాలేజీ కోల్పోయింది. రేడియో డయాగ్నసిస్‌, పాథాలజీ, డిప్లొమో ఇన్‌ ఆర్థోపెడిక్స్‌, ఎండీ సైకియాట్రీ, ఎండీ ఆప్తమాలజీ, ఎండీ ఫార్మకాలజీ, ఎండీ అనాటమి, ఎండీ ఫిజియాలజీ, ఎండీ బయో కెమిస్ట్రీ, ఎండీ ఫల్మనరీ మెడిసిన్‌, ఎండీ రేడియాలజీ, ఎండీ మైక్రోబయాలజీ, ఎండీ కమ్యూనిటీ మెడిసిన్‌, ఎంఎస్‌ ఆర్థోపెడిక్స్‌, ఎండీ అనస్థీయాలజీ, ఎండీ గైనకాల జీ, ఎంఎస్‌ జనరల్‌ సర్జరీ, ఎండీ డెర్మటాలజీ, ఎండీ పీడియాట్రిక్స్‌, ఎండీ జనరల్‌ మెడిసిన్‌, ఎంఎస్‌ ఈఎన్‌టీ విభాగాలకు చెందిన పీజీ సీట్ల గుర్తింపు రద్దయింది. ప్రస్తుతం ఆ కాలేజీలో 80 మంది పీజీ విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు.



    ఈ ఏడాది ఫిబ్రవరిలో అడ్మిషన్లు ప్రారంభం కాగా, మే 3 నాటికి కౌన్సెలింగ్‌ ముగిసింది. అయితే మార్చి 30న ఎన్‌ఎం సీ బృందం ఆ కాలేజీలో ఆకస్మిక తనిఖీలు చేసింది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన అధ్యాపకులు, మౌలిక వసతులు లేకపోవడంతో పీజీ సీట్ల గుర్తింపును రద్దు చేస్తున్నట్లు మే 19న ఎన్‌ఎంసీ తన వెబ్‌సైట్‌లో ఉంచింది. విషయం ఆలస్యంగా తెలుసుకున్న 80 మంది పీజీ విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. కౌన్సెలింగ్‌కు ముందే తనిఖీలు చేసి, గుర్తింపు రద్దుచేసి ఉంటే తమకు ఈ పరిస్థితి వచ్చేదే కాదని వాపోతున్నారు. తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటీవల అనుమతులు రద్దయిన మెడికల్‌ కాలేజీల్లోని విద్యార్థులకు ఊరట లభించే అవకాశాలున్నాయి.

    Telangana: ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

    Free Coaching: ఎంసెట్‌, ఐఐటీ ప్రిపేర్ అయ్యే విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. ఉచిత కోచింగ్ అందిస్తున్న ప్ర‌భుత్వం

    అనుమతులు రద్దయిన కాలేజీలకు విద్యార్థులు కట్టిన ఫీజులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, ఆ మొత్తాన్ని విద్యార్థులు కొత్తగా జాయిన్‌ అయ్యే కాలేజీలకు బదిలీ చేయాలని సూచించింది. రాష్ట్రంలోని ఎంఎన్‌ఆర్‌, టీఆర్‌ఆర్‌, మహావీర్‌ మెడికల్‌ కాలేజీల పర్మిషన్లను ఎన్‌ఎంసీ రద్దు చేయడంతో.. 450 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులు, 80 మంది పీజీ స్టూడెంట్స్‌ భవితవ్యం గందరగోళంలో పడింది. ఎన్‌ఎంసీ మార్గదర్శకాల ప్రకారం స్టూడెంట్ల రీలొకేషన్‌పై పరిశీలిస్తున్నామని కాళోజీ వర్సిటీ అధికారులు చెబుతున్నారు. దీనిపై త్వరలోనే తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Hyderabad, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు