త్రుటిలో తప్పిన ప్రమాదం.. పట్టాలు తప్పిన ఎంఎంటీఎస్

ప్రతీకాత్మక చిత్రం

లింగంపల్లి నుంచి హైదరాబాద్ వెళ్లే ఎంఎంటీఎస్ రైలు హఫీజ్ పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. డ్రైవర్ అప్రమత్తమై రైలును నిలిపేయడంతో ప్రమాదం తప్పింది.

  • Share this:
    అది లింగంపల్లి రైల్వే స్టేషన్. సమయం సాయంత్రం 5.20 గంటలు. ప్లాట్ ఫామ్‌ నుంచి లింగంపల్లి టూ హైదరాబాద్ వెళ్లే ఎంఎంటీఎస్ రైలు(47141) బయలుదేరింది. 5 నిమిషాల అనంతరం చందానగర్ రైల్వే స్టేషన్ దాటి హఫీజ్ పేట్ స్టేషన్ చేరుకుంటుంది. ఒక్కసారిగా రైలు చివరి బోగి చక్రం రాడ్డు విరిగింది. దీంతో పెద్ద శబ్దంతో రైలు పట్టాలు తప్పి బోగి పక్కకు ఒరిగింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ చాకచక్యంగా రైలును నిలిపేశాడు. ఫలితంగా ప్రయాణికులు ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడ్డారు. ఎంఎంటీఎస్ రైలు పట్టాలు తప్పడంతో పలు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశారు.
    Published by:Narsimha Badhini
    First published: