హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: భారీ శబ్దంతో ఆగిపోయిన ఎంఎంటీఎస్ రైలు.. పట్టాలపై ప్రయాణికుల పరుగులు

Hyderabad: భారీ శబ్దంతో ఆగిపోయిన ఎంఎంటీఎస్ రైలు.. పట్టాలపై ప్రయాణికుల పరుగులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad MMTS Train: బేగంపేట స్టేషన్ నుంచి బయలుదేరిన కాసేపటికే రైలు ఆగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ సమయంలో స్పీడ్ తక్కువగానే ఉందని వెల్లడించారు. ఒకవేళ అధిక వేగంతో ఉండి ఉంటే.. పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని అభిప్రాయపడ్డారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైలు (MMTS Trains)కు పెను ప్రమాదం తప్పింది. బేగంపేట రైల్వే స్టేషన్ (Begumpet Railway Station) సమీపంలో ఓ ఎంఎంటీఎస్ రైలు భారీగా శబ్దంతో ఒక్కసారిగా ఆగిపోయింది. పెద్ద పెద్ద శబ్దాలతో పట్టాలపై నిలిచిపోవడంతో ప్రయాణికులు భయపడిపోయారు. రైలు నుంచి కిందకు దిగి పరుగులు పెట్టారు. లింగంపల్లి నుంచి నాంపల్లికి వెళ్లాల్సిన రైలు బేగంపేటలో కాసేపు ఆగింది. అనంతరం నాంపల్లికి వెళ్తున్న సమయంలో.. బేగంపేట, నెక్లెస్ రోడ్డు స్టేషన్‌ల మధ్య ఒక్కసారిగా ఆగిపోయింది. పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో ప్రయాణికులు టెన్షన్ పడ్డారు. ఏదో జరిగిందని.. భయంతో పరుగులు తీశారు. ఐతే రైలు ఎందుకు ఆగిపోయింది? ఎలాంటి సాంకేతిక సమస్య వచ్చిందన్న వివరాలు తెలియరాలేదు. రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. వీలైనంతర త్వరగా పునరుద్దరిస్తామని తెలిపారు.

  బేగంపేట స్టేషన్ నుంచి బయలుదేరిన కాసేపటికే రైలు ఆగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ సమయంలో స్పీడ్ తక్కువగానే ఉందని వెల్లడించారు. ఒకవేళ అధిక వేగంతో ఉండి ఉంటే.. పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని అభిప్రాయపడ్డారు. పట్టాలు తప్పకపోవడంతో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నామని పేర్కొన్నారు. ఉదయం ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో లింగంపల్లి-హైదరాబాద్ లోకల్‌ ట్రైన్‌లో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారు. రైలు ఉన్నట్లుండి పట్టాలపై ఆగిపోవడంతో.. ఆఫీసులు, కాలేజీలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అక్కడి నుంచి కాలినడకన సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్‌కు వెళ్లిపోయారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో తమ గమ్యస్థానాలకు బయలుదేరారు.

  Telangana: ఈ 6 జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.. నేడు అతి భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్

  హైదరాబాద్‌లో అత్యంత చౌకయిన ప్రజా రవాణా వ్యవస్థగా ఎంఎంటీఎస్ (మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్)కు పేరుంది. హైదరాబాద్‌లో ప్రధానంగా మూడు మార్గాల్లో ఈ లోకల్ రైళ్లు తిరుగుతాయి. ఫలక్‌నామా-లింగంపల్లి, ఫలక్‌నామా-నాంపల్లి, నాంపల్లి-లింగంపల్లి రూట్లలో ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్నాయి. నిత్యం ఎంతో మంది ఉద్యోగులు, కాలేజీ విద్యార్థులు, చిరు వ్యాపారులు, దినసరి కూలీలు వీటిలో తమ గమ్యస్థానాలకు వెళ్తున్నారు. తక్కువ ధరకే నగరంలోని దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉండడంతో చాలా మంది బస్సులు, మెట్రో రైళ్ల కన్నా.. ఎంఎంటీస్‌లోనే ప్రయాణిస్తుంటారు.

  హైద్రాబాద్‌లో ట్రాఫిక్ సమస్యను తగ్గిచండంతో పాటు ప్రయాణికులకు తక్కువ ధరలోనే మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో... 2003లో హైద్రాబాద్ మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ (MMTS)ను 2003లో ప్రారంభించారు. అప్పటి ఉప ప్రధాని ఎల్ కే అద్వానీ 2003 ఆగస్టు 9న ఎంఎంటీఎస్ సర్వీసులను ప్రారంభించారు. హైద్రాబాద్‌లోని ప్రధాన రైల్వే స్టేషన్‌లు కాచిగూడ, సికింద్రాబాద్, హైదరాబాద్ స్టేషన్‌లతో పాటు నగర శివారులోని లింగంపల్లి, ఫలక్‌నామా స్టేషన్‌ను లోకల్ రైళ్లతో అనుసంధానించారు. అతి తక్కువ ఖర్చుతో సుదూర ప్రయాణం చేసే అవకాశం ఉండడంతో హైదరాబాద్ ప్రజలను వీటిని ఎంతగానో ఆదరిస్తున్నారు. ప్రతి రోజూ దాదాపు 3 లక్షల మంది తమ గమ్య స్థానాలకు వెళ్తున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Hyderabad, Secunderabad

  ఉత్తమ కథలు