రైలు డ్రైవర్ క్షేమం.. 8 గంటల తర్వాత ఇంజిన్ నుంచి బయటకు..

గ్యాస్ కట్టర్‌ల సాయంతో ఇంజిన్ భాగాలను తొలగించిన ఎట్టకేలకు చంద్రశేఖర్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

news18-telugu
Updated: November 11, 2019, 6:52 PM IST
రైలు డ్రైవర్ క్షేమం.. 8 గంటల తర్వాత ఇంజిన్ నుంచి బయటకు..
ట్రైన్ ఇంజిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్
  • Share this:
కాచిగూడలో ఎంఎంటీఎస్ రైలు ఇంజిన్‌లో చిక్కుకున్న లోకో పైలట్ చంద్రశేఖర్‌ ప్రాణాలతో బయటపడ్డాడు. దాదాపు 8 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత అతడిని సహాయక సిబ్బంది బయటకు తీశారు. అనంతరం ప్రాథమిక చికిత్స కోసం నాంపల్లిలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. ఉదయం రైలు ప్రమాదంలో ఎంఎంటీఎస్ రైలు ఇంజిన్ నుజ్జనుజ్జయింది. ఇంజిన్ కేబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ను బయటకు తీసేందుకు రెస్క్యూ టీమ్ తీవ్రంగా శ్రమించింది. గ్యాస్ కట్టర్‌ల సాయంతో ఇంజిన్ భాగాలను తొలగించిన ఎట్టకేలకు చంద్రశేఖర్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఇవాళ ఉదయం రైలు ప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్‌లో నిలిపి ఉన్న హంద్రీ ఎక్స్‌ప్రెస్ రైలును లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. రెండు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇంజిన్లు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎంఎంటీఎస్ లోకో పైలట్ సహా 12 మందికి గాయాలయ్యాయి.

ఐతే రెండు రైళ్లు ఢీకొట్టుకోవడానికి సిగ్నలింగ్ వ్యవస్థ కారణం కాదని.. అందులో ఎలాంటి లోపం లేదని cpro రాకేష్ వెల్లడించారు. రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పైకి వచ్చేలా ఎవరూ సిగ్నల్ ఇవ్వలేదని.. మరి సిగ్నల్ ఇవ్వకుండా లోకో పైలట్ ఆ ట్రాక్ మీదకు ఎందుకు తీసుకెళ్లాడో దర్యాప్తులో తేలుతుందని తెలిపారు. అటు రైల్వే ఏజీఏం బీబీ సింగ్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. లోకో పైలట్ (రైలు డ్రైవర్) తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు. ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరుగుతుందని తెలిపారు.First published: November 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు