హైదరాబాద్ కాచీగూడలో ప్రమాదం... ఇంటర్‌సిటీని ఢీకొన్న ఎంఎంటీఎస్ రైలు

కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఆగివున్న ట్రైన్ వెనకనుంచి వస్తున్న మరో ఎంఎంటిఎస్ ట్రైన్.. ఢీకొట్టింది.

news18-telugu
Updated: November 11, 2019, 3:16 PM IST
హైదరాబాద్ కాచీగూడలో ప్రమాదం... ఇంటర్‌సిటీని ఢీకొన్న ఎంఎంటీఎస్ రైలు
కాచిగూడలో రైలు ప్రమాదం
  • Share this:
హైదరాబాద్ కాచీగూడ రైల్వే స్టేషన్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ఎంఎంటీఎస్ రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ట్రాక్‌పై ఉన్న బోగీలు పక్కకు ఒరిగాయి. కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఆగివున్న ట్రైన్‌ను వెనకనుంచి వస్తున్న మరో ఎంఎంటిఎస్ ట్రైన్.. ఢీకొట్టింది. ఈ ఘటనలో 12మంది  తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న రైల్వే జీఆర్పీ పోలీసులు.... ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఎంఎంటీఎస్ డ్రైవర్ శేఖర్ రైలు ఇంజిన్‌లో ఇరుక్కుపోయారు. దీంతో అతడ్ని తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

కాచిగూడలో రైలు ప్రమాద దృశ్యాలు


టెక్నికల్ సమస్యల వల్లే ఈ ప్రమాదం జరిగిటనట్లు అధికారులు చెబుతున్నారు. సాంకేతిక లోపంతో ఇంటర్ సిటీ ట్రైన్ ఉన్న ట్రాక్‌పైకి ఎంఎంటీఎస్ రైలు వచ్చినట్లు అధికారలుు చెబుతున్నారు. ఈ ఘటనలో రైలు బోగీలు పక్కకు ఒరిగాయి. ఎంఎంటీఎస్‌కు చెందిన మూడు కోచ్‌లు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎంఎంటీఎస్ ట్రైన్ ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఎంఎంటీఎస్‌కు చెందిన ఆరు బోగీలు పక్కనే ఉన్నరైలు పట్టాలపై పడిపోయాయి.  దీంతో కాచిగూడ స్టేషన్‌లో రైళ్ల రాకపోకల్ని అధికారులు పూర్తిగా నిలిపివేశారు.

రైలు ప్రమాదంలో పలువురికి గాయాలు






First published: November 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com