హోమ్ /వార్తలు /తెలంగాణ /

Kavitha - ATA : ఆటా మహా సభలకు MLC కవిత.. ఈసారి డిఫరెంట్‌గా..!

Kavitha - ATA : ఆటా మహా సభలకు MLC కవిత.. ఈసారి డిఫరెంట్‌గా..!

MLC Kavitha - File Photo

MLC Kavitha - File Photo

మధ్యాహ్నం తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత సాయంత్రం ప్రవాస తెలుగు వారు పాల్గొనే సభలో ఆమె ప్రసంగించనున్నారు.

Kavitha - ATA : అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొనబోతున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జూలై 1 నుంచి 3 వరకు ఆటా మహాసభలు - యూత్ కన్వెన్షన్ జరగనున్నాయి. జూలై 2న ఆటా మహాసభల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొంటారు. ఆ రోజు మధ్యాహ్నం తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత సాయంత్రం ప్రవాస తెలుగు వారు పాల్గొనే సభలో ఆమె ప్రసంగించనున్నారు.


అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) 17వ మహాసభల్లో పాల్గొనాల్సిందింగా ఎమ్మెల్సీ కవితను ఆటా ప్రతినిధులు ఇప్పటికే ఆహ్వానించారు. పోస్ట్ పాండమిక్ తర్వాత జరగనున్న ఈ మహాసభలు తమకు ప్రత్యేకమైనవని ఆటా ప్రతినిధులు తెలిపారు. ఇన్నేళ్లు జరిగిన మహాసభలు ఒక ఎత్తైతే.. ఈ ఏడాది జరగబోయేవి తమకు ప్రత్యేకమన్నారు. ఆనందాలు, బాధలు, విజయాలు, అవకాశాలు పంచుకునే వేదికగా ఇది మారబోతోందని తెలిపారు.

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జులై 2 నాడు మధ్యాహ్నం తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రవాసులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. సాయంత్రం 8 గంటలకు దాదాపు 10వేల మంది ప్రతినిధులు హాజరయ్యే మీటింగ్ లో ఆమె పాల్గొంటారు. ఆటా ప్రైమ్ మీట్ పబ్లిక్ మీటింగ్ లో ఎమ్మెల్సీ కవిత చీఫ్ గెస్ట్ గా హాజరవుతారని ఆర్గనైజర్లు తెలిపారు.

ఇదే సమావేశంలో బతుకమ్మ పండుగపై ఆటా ప్రచురించిన బతుకమ్మ ప్రత్యేక సంచికను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించనున్నారు. ప్రతిష్టాత్మకంగా ఆటా నిర్వహించే ఈ వేడుకలు ఈ సంవత్సరం మరింత పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆటా ప్రతినిధులు తెలిపారు. వందలాదిగా వాలంటీర్లు వివిధ ఏర్పాట్ల కోసం 80 కమిటీలుగా ఏర్పడి ఇందుకోసం శ్రమిస్తున్నట్లు ఆటా ప్రతినిధులు మీడియాకు సమాచారం అందించారు.

Published by:V. Parameshawara Chary
First published:

Tags: Kalvakuntla Kavitha

ఉత్తమ కథలు