Home /News /telangana /

MLC KAVITHA SAID THAT SHE WAS HEARTBROKEN BY THE CENTRE DISCRIMINATION AGAINST TELANGANA OVER GRAIN PURCHASES AND FLOOD RELIEF PRV

Telangana politics: కేంద్రం తీరుతో గుండె బద్దలవుతోందన్న ఎమ్మెల్సీ కవిత.. చూడండి ఈ అన్యాయమంటూ ట్వీట్..

కల్వకుంట్ల కవిత ( ఫైట్ ఫోటో)

కల్వకుంట్ల కవిత ( ఫైట్ ఫోటో)

వరదల సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉన్నారని క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ ఆదుకోలేదని ఆరోపించారు.

    టీఆర్​ఎస్ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీపై దూకుడు పెంచింది. ధాన్యం కొనుగోలు అంశాన్ని ప్రధాన ఎజెండాగా తెలంగాణ (Telangana)లో నిరసనలు చేస్తోంది. ఈ సందర్భంగా మంత్రులంతా రోడ్డెక్కి బీజేపీ, కేంద్ర మంత్రులకు వ్యతిరేకగా నిరసనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత (MLC kavitha) కూడా కేంద్రంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కేంద్రం విడుదల చేసిన వరద సాయం బిల్లులను ట్విటర్​లో పెట్టి కేంద్రం (Center) తీరును ఎండగట్టారు. వరద సాయంలోనూ కేంద్రం తెలంగాణకు మొండి చేయి చూపిందని విమర్శించారు. కేంద్రం తీరు చూస్తుంటే తన గుండె బద్దలవుతోందని (heartbroken ) ఆమె ట్వీట్ (tweet)​ చేశారు. రైతులకు మద్దతుగా నిలవాల్సిన కేంద్రం.. పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. ధాన్యం సేకరణలో FCIకి సరైన విధానమంటూ లేదని మండిపడ్డారు. ధాన్యం సేకరణపై FCI ప్రతి సంవత్సరం కేలండర్​ విడుదల చేయాలని కవిత డిమాండ్‌ చేశారు . దేశమంతా ధాన్యం సేకరణ (Paddy Procurement) విధానం ఒకే విధంగా ఉండాల్సిన అవసరముందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.

    ఆహార భద్రత ముఖ్యమని..

    దేశ వ్యాప్తంగా రైతులు చేసిన ఉద్యమం తో సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నట్లు గానే తెలంగాణ లోని ప్రతి వరి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఢిల్లీ వీధుల్లో తెలంగాణ రైతులు ఉద్యమిస్తారని  కవిత హెచ్చరించారు. ధాన్యం కొనుగోలుపై అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం ఉండాలని డిమాండ్ చేశారు. 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఆహార భద్రత ముఖ్యమని, భవిష్యత్తులో ఏదైనా సంక్షోభంతో ఆహార కొరత ఏర్పడితే ప్రపంచంలోని ఏ దేశమూ సాయం అందించలేదని ఎమ్మెల్సీ కవిత ఆందోళన వ్యక్తం చేశారు.

    బీజేపీ ప్ర‌భుత్వం తెలంగాణ‌పై వివక్ష చూపుతోంద‌ని క‌విత ఆరోపించారు. వ‌ర‌ద సాయంలోనూ ఇదే క‌నిపించింద‌ని అన్నారు. ఈ విష‌యంలోనూ తెలంగాణకు అన్యాయం జ‌రిగింద‌ని విమ‌ర్శించారు. 2021-22 ఆర్థిక సంవ‌త్సరంలో కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణకు ఎలాంటి ఎన్డీఆర్ఎఫ్ నిధులూ కేటాయించలేదని అన్నారు. దీనికి సంబంధించిన నివేదిక‌ను ట్విట్ట‌ర్ లో  క‌విత పోస్ట్ చేశారు.

    ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఎమ్మెల్సీ కవిత..

    హైద‌రాబాద్ లో 2020 సంవ‌త్స‌రంలో భారీ వ‌ర్షాలు, వ‌రదలు వ‌చ్చాయ‌ని క‌విత గుర్తు చేశారు. దీంతో హైద‌రాబాద్ తీవ్రంగా న‌ష్ట‌పోయింద‌ని అన్నారు. అయితే నష్టపోయిన హైదరాబాద్‌ ప్రజలకు సాయం అందించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా వివక్ష చూపుతుందని ఆరోపించారు.  2021-22 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి వివిధ రాష్ట్రాలకు అందించిన జాతీయ విపత్తుల ఉపశమన నిధుల (ఎన్డీఆర్‌ఎఫ్‌) వివరాలను కేంద్రం తాజాగా విడుదల చేసింది. అయితే కేంద్రం విడుద‌ల చేసిన నివేదికను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఎమ్మెల్సీ కవిత, ఆ నివేదికలో తెలంగాణ రాష్ట్రం పేరు లేకపోవడాన్ని  ప్రస్తావించారు.



    వరదల సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉన్నారని క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ ఆదుకోలేదని ఆరోపించారు. ప్రతీ అంశంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివ‌క్ష చూపుతోంద‌ని అన్నారు. ఈ వైఖ‌రి వల్ల మ‌న‌సు క‌లచివేస్తోంద‌ని ఆమె తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు.



    ""తెలంగాణ పట్ల కేంద్రప్రభుత్వం పక్షపాత హద్దులన్నీ దాటేసింది. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ - మన రైతులు, వారి శ్రమ, పంటల విషయంలో వెనక్కి తగ్గదు. మోదీ ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రతి వరి గింజను మన రైతుల నుండి సేకరించాలి’* ఆమె తెలిపారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Emotional tweet, Kalvakuntla Kavitha, Kavitha

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు