హోమ్ /వార్తలు /తెలంగాణ /

Delhi Liquor scam: ఢిల్లీ లిక్కర్​ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు? స్పందించిన కవిత..

Delhi Liquor scam: ఢిల్లీ లిక్కర్​ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు? స్పందించిన కవిత..

MLC KAVITHA,ED(FILE)

MLC KAVITHA,ED(FILE)

ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Liquor scam) వ్యవహారంలో సీఎం కేసీఆర్​ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిందా? ఈ ప్రశ్న తెలంగాణలో సంచలనం సృష్టిస్తోంది

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor scam) వ్యవహారంలో సీఎం కేసీఆర్​ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (MLC Kavitha) ఈడీ నోటీసులు ఇచ్చిందా? ఈ ప్రశ్న తెలంగాణలో సంచలనం సృష్టిస్తోంది. కాగా, ప్రస్తుతం ఆమె కరోనాతో క్వారంటైన్ లో ఉండటంతో ఆ నోటీసులను కవిత సహాయకులకు నోటీసులను (ED Notices) అందజేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.  దీనిపై ఈడీ అధికారులు నోరు విప్పడం లేదు. అయితే తనకు ఈడీ నోటీసులు ఇచ్చిందంటూ  మీడియాలో వార్తలు రావడంపై  ఎమ్మెల్సీ కవిత  (MLC Kavitha) ఓ ప్రకటన విడుదల చేశారు. అసలు తనకు ఎలాంటి నోటీసులు ఈడీ ఇవ్వలేదని ట్విటర్ వేదికగా స్పష్టతనిచ్చారు. మీడియా నిజాలు రాయాలంటూ చురకలంటించారు. మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని కవిత ఆరోపించారు.

  “ఢిల్లీలో కూర్చొని దురుద్దేశంతో మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారు. మీ సమయాన్ని నిజం చూపించడానికి ఉపయోగించమని నేను అన్ని మీడియా సంస్థలను అభ్యర్థిస్తున్నాను. టీవీ వీక్షకుల విలువైన సమయాన్ని ఆదా చేసేందుకు, నాకు ఎలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేయాలనుకుంటున్నాను”. అని కవిత తెలిపారు.

  పూర్తి వివరాల్లోకి వెళితే..  ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో భాగంగా దూకుడు పెంచిన ఈడీ అధికారులు దేశవ్యాప్తంగా ఏక కాలంలో ఐదు రాష్ట్రాల్లో 40కు పైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారుల బృందాలు నగరంలోని పలు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నాయి. సోదాలు చేయడానికి నిర్దిష్టంగా సెర్చి వారెంట్లను కూడా జారీ చేసినట్లు ఢిల్లీలోని ఈడీ వర్గాల సమాచారం. తాజా సోదాలకు అనుబంధంగా మొత్తం 12 మంది వ్యక్తులకు, 18 కంపెనీలకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. అందులో కవిత పేరు కూడా ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

  ఈ కేసులో దేశవ్యాప్తంగా 40 కి పైగా ప్రాంతాలలో ఈడీ అధికారులు ఈరోజు ఉదయం నుంచి దాడులు నిర్వహిస్తున్నారు. ఈడి రైడ్స్ కోసం ఢిల్లీ నుండి మొత్తం 68 మంది ఈడి అధికారులు వచ్చారు. ఈడీ నుంచి నోటీసులు జారీ అయిన వారిలో..  అరుణ్ రామచంద్రన్ పిళ్ళై, శరత్ చంద్రా రెడ్డి, అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు గోరంట్ల, పెర్నాయి రిచర్డ్, విజయ్ నాయర్, సమీర్ మహీంద్ర, దినేష్ అరోరా, చందన్ రెడ్డి, వై. శశికళ, మాగుంట రాఘవలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ 11 మందికి నోటీసులు జారీ అయినట్లు అనధికారిక సమాచారం. పన్నెండవ వ్యక్తి వివరాలు బయటకు తెలియనీయడం లేదు. కానీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ అయినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఎమ్మెల్సీ కవిత స్ఫష్టతనిచ్చారు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని వెల్లడించారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Enforcement Directorate, Hyderabad, Kalvakuntla Kavitha, Liquor policy

  ఉత్తమ కథలు