హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nizamabad : ఎమ్మెల్సీ కవిత ఎన్నిక ఏకగ్రీవమేనా.. ? విపక్షాల నిర్ణయంతో మారిన సీన్..

Nizamabad : ఎమ్మెల్సీ కవిత ఎన్నిక ఏకగ్రీవమేనా.. ? విపక్షాల నిర్ణయంతో మారిన సీన్..

ఎమ్మెల్సీగా నామినేషన్ వేస్తున్న కవితా

ఎమ్మెల్సీగా నామినేషన్ వేస్తున్న కవితా

Nizamabad : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి కవిత ఎన్నిక లాంచనప్రాయమే కానుంది. అనుహ్యంగా తెరమీదకు వచ్చిన కవిత ఎన్నిక ఏకగ్రీవం అయ్యెందుకు అవకాశాలు ఉన్నాయి.


న్యూస్18తెలుగు ప్ర‌తినిదిః పి మ‌హేంద‌ర్,

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అప్పుడే తన వ్యుహాలను రచిస్తోంది. నామినేషన్లకు ముందే తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ముందస్తుగానే పావులు కదుపుతోంది. ( Nizamabad Local bodies mlc elections )ఈ క్రమంలోనే సీఎం కేసిఆర్ తనయ , ఎమ్మెల్సీ కవిత పోటిచేస్తున్న నిజామాబాద్ జిల్లాల్లో ప్రత్యర్థి పార్టీలు నామినేషన్‌ వేయకపోవడంతో ఆమె గెలుపు సునాయసం కానుంది. మరోవైపు ఎలాంటీ ఎన్నికలు లేకుండానే ఏకగ్రీవంగా ఎన్నికయ్యె అవకాశాలు కనిపిస్తున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని చోట్ల బీజేపితో పాటు కాంగ్రెస్ పార్టీ బరిలో నిలవకపోవడంతో ఆపార్టీ గెలుపు నల్లేరు మీద నడక అవుతోంది.ఈ క్రమంలోనే నిజామాబాద్‌లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ( Nizamabad Local bodies mlc elections ) జిల్లాలో బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా పోటికి దూరంగా ఉంటామని ప్రకటించారు. దీంతో అనుహ్యంగా కవితను రంగంలోకి దింపారు. ఎన్నికల నామినేషన్‌కు ఒక్కరోజు ముందుగానే ఆమె అభ్యర్థిత్వాన్ని ఖారారు చేశారు. రాజ్యసభకు వెళుతుందని భావించిన వారికి షాకిచ్చి తిరిగి కవితను బరిలోకి దింపారు.

ఇది చదవండి : కరీంగనగర్ జిల్లాలో అధికార టీఆర్ఎస్‌కు షాక్.. ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా మాజీ మేయర్


ఇక నేడు నామినేషన్ చివరి రోజు కావడంతో మూడు సెట్ల నామినేషన్ పత్రాలను కవిత ధాఖలు చేశారు. అయితే ఆమెకు పోటిగా ఒకే ఒక్క ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ ధాఖలైంది. ( Nizamabad Local bodies mlc elections ) అదికూడా ఆ పార్టీ ఎంపీటీసిగా ఉన్న శ్రీనివాస్ అనే అభ్యర్థి ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశారు. ఎంపీటీసీలను రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవవిగ్రహాలుగా చూస్తుందనే ఆలోచనతోనే తాను నామినేషన్ వేసినట్టు ఆయన చెప్పారు. తమ న్యాయమైన డిమాండ్స్ కోసం పోటిలో ఉంటానని స్పష్టం చేశారు.


ఇది చదవండి  : ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డితో క్షమాపణలు చెప్పిస్తాం.. రివర్స్ అయిన "వరి" వ్యాఖ్యలు


అయితే ఎన్నికల్లో కవితను ఏకగ్రీవం చేసేందుకు ఆపార్టీ నేతలు పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఉన్న అభ్యర్థిని విత్ డ్రా చేయించడం ద్వారా ఎన్నికలు లేకుండా చేయాలని వ్యుహాలు రచిస్తున్నట్టు సమాచారం.( Nizamabad Local bodies mlc elections ) ఇక రేపు నామినేషన్ వేసిన సభ్యుల స్క్ర్యూటిని పూర్తయిన తర్వా 26వ తేదిన ఉపసంహరణకు అవకాశం ఉంది. దీంతో ఇండిపెండెంట్  అభ్యర్థులు రంగంలో ఉంటారా లేదా అనేది తేలనుంది. అయితే కవిత గెలుపుకు సంబంధించి ఇప్పటికే ఆ పార్టీ నేతలు సంకేతాలు ఇచ్చారు. జిల్లాలో ఒక్కరే నామినేషన్ వేయడం.. అది కూడా ఎంపీటీసి వేయడంతో ఎలాగైనా ఆయన్ను ఎన్నికల బరి నుండి తప్పించి ఏకగ్రీవం చేయడం ద్వారా టీఆర్ఎస్ బలంతో పాటు కవిత గెలుపును సాధించవచ్చనే వ్యుహంతో పార్టీ నేతలు ఉన్నట్టు సమాచారం.

First published:

Tags: Kalvakuntla Kavitha, Nizamabad

ఉత్తమ కథలు