హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nizamabad : ఎమ్మెల్సీ కవిత ఎన్నిక ఇక ఏకగ్రీవమే..? ఇండిపెండెండ్ అభ్యర్థి నామినేషన్‌లో వివాదం

Nizamabad : ఎమ్మెల్సీ కవిత ఎన్నిక ఇక ఏకగ్రీవమే..? ఇండిపెండెండ్ అభ్యర్థి నామినేషన్‌లో వివాదం

ఎమ్మెల్సీ కవిత (ఫైల్ ఫోటో)

ఎమ్మెల్సీ కవిత (ఫైల్ ఫోటో)

Nizamabad : నిజామాబాద్ ( Nizamabad )స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి కవిత ఎన్నిక ( MLC Kavita )లాంచనప్రాయమే కానుంది. ఇండిపెండెంట్ అభ్యర్థి ఎన్నికపై వివాదం చెలరేగడంతో.. అనుహ్యంగా తెరమీదకు వచ్చిన కవిత ఎన్నిక ఎకగ్రీవం అయ్యెందుకు అవకాశాలు ఉన్నాయి.

ఇంకా చదవండి ...

  స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అప్పుడే తన వ్యుహాలను రచిస్తోంది. నామినేషన్లకు ముందే తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ముందస్తుగానే పావులు కదుపుతోంది. ( Nizamabad Local bodies mlc elections ) ఈ క్రమంలోనే సీఎం కేసిఆర్ తనయ , ఎమ్మెల్సీ కవిత పోటిచేస్తున్న నిజామాబాద్ జిల్లాల్లో ప్రత్యర్థి పార్టీలు నామినేషన్‌ వేయకపోవడంతో ఆమె గెలుపు సునాయసం కానుంది.

  అయితే ఎన్నికల్లో మరోవైపు అయితే ఆమెకు పోటిగా ఒకే ఒక్క ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ ధాఖలైంది. ( Nizamabad Local bodies mlc elections ) అదికూడా ఆ పార్టీ ఎంపీటీసిగా ఉన్న శ్రీనివాస్ అనే అభ్యర్థి ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశారు. ఎంపీటీసీలను రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవవిగ్రహాలుగా చూస్తుందనే ఆలోచనతోనే తాను నామినేషన్ వేసినట్టు ఆయన చెప్పారు. తమ న్యాయమైన డిమాండ్స్ కోసం పోటిలో ఉంటానని స్పష్టం చేశారు.

  ఇది చదవండి : చరిత్రలో రికార్డు ఆదాయాన్ని పొందిన ఆర్టీసీ.. ఎంతంటే..


  అయితే శ్రీనివాస్ నామినేషన్‌కు సంబంధించి వివాదం కొనసాగుతోంది.కోటగిరి శ్రీనివాస్ రావు నామినేషన్ వేసిన నేపథ్యంలోనే ఆయనకు ఆయన్ను బలపరిచారని చెబుతున్న వారు మీడియా ముందుకు వచ్చారు. తాము ఎవ్వరిని బలపరచలేదని చెప్పారు. ( Nizamabad Local bodies mlc elections ) కాగా శ్రీనివాస్‌ను బలపరిచిన వారిలో ఎర్రం నవనీత అనే నందిపేట ఎంపీటీసి,లోపాటు నిజామాబాద్ కార్పోరేటర్ గజియా సుల్తానా కూడా ఉన్నట్టు చెబుతున్నారని అయితే తాము ఎవ్వరిని బలపరచలేదని స్పష్టం చేశారు.. దీంతో ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసిన శ్రీనివాస రావు ఒకవేళ బరిలో నిల్చున్నా ఆయన్ను బలపరచిన వారు ముందుకు రాకపోవడంతో ఆయన నామినేషన్ రద్దు అయ్యె అవకాశాలు కనిపిస్తున్నాయి.


   ఇది చదవండి : హైదరాబాద్ పై దృష్టి పెట్టిన బీజేపీ.. కార్పోరేటర్ల అరెస్ట్.. ఖండించిన నేతలు


  స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని చోట్ల బీజేపితో పాటు కాంగ్రెస్ పార్టీ బరిలో నిలవకపోవడంతో ఆపార్టీ  గెలుపు నల్లేరు మీద నడక అవుతోంది.ఈ క్రమంలోనే నిజామాబాద్‌లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ( Nizamabad Local bodies mlc elections ) జిల్లాలో బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా పోటికి దూరంగా ఉంటామని ప్రకటించారు. దీంతో అనుహ్యంగా కవితను రంగంలోకి దింపారు. ఎన్నికల నామినేషన్‌కు ఒక్కరోజు ముందుగానే ఆమె అభ్యర్థిత్వాన్ని ఖారారు చేశారు. కాగా అనూహ్య పరిస్థితుల్లో ఆమె ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

  ఇక 12 స్థానాలకు గాను 102 నామినేషన్లు ధాఖలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ మెదక్ , ఖమ్మం జిల్లాల్లో తన అభ్యర్థులను నిలిపింది. కాగా కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ ధాఖలు చేశారు. ఇక ఎన్నికలు డిశంబర్ 10 ఎన్నికలు జరగనుండగా 14 ఫలితాలు వెలువడనున్నాయి.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Nizamabad, Telangana mlc election

  ఉత్తమ కథలు