MLC Kavitha: తెలంగాణ పెరుగుతున్న కరోనా కేసులు.. సాయం కోసం ఈ నంబర్లకు కాల్ చేయండి.. ఎమ్మెల్సీ కవిత ట్వీట్..

కవిత (ఫైల్ ఫోటో)

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల సహాయం కోసం ఎమ్మెల్సీ కవిత ప్రత్యే హెల్ఫ్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు.

 • Share this:
  దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. తెలంగాణలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు తనకు తోచిన సాయం అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ముందుకొచ్చారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రత్యే హెల్ఫ్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. కోవిడ్-19కు సంబంధించిన సహాయం కోరకు ప్రజల నుంచి పెద్ద నిరంతరం ఫోన్ కాల్స్, మెసేజ్‌లు వస్తున్న దృష్ట్యా ప్రత్యేక ఫోన్ నంబర్ల ఏర్పాటు చేశామ‌ని క‌విత తెలిపారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. కోవిడ్-19కు సంబంధించిన అభ్యర్థనల కోసం హైదరాబాద్‌- 040-23599999 / 89856 99999, నిజామాబాద్‌- 08462- 250666 నెంబర్లకు ఫోన్ చేసి తన కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. తన టీమ్ నిరంతరం(24 గంటలు) సేవలు అందించేందుకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.

  ఇక, తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,251 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 355 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 258, నిజామాబాద్ జిల్లాలో 244 కేసులు నమోదయ్యాయి. ఇక, రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,29,529కి చేరింది. తాజాగా కరోనాతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,765కి చేరింది. ఇక, నిన్న కరోనా నుంచి 565 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,05,900గా ఉంది.

  మరోవైపు కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. కరోనా కట్టడిలో భాగంగా ఇక నుంచి బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్క్‌ ధరించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. మాస్క్‌ ధరించకపోతే 1000 రూపాయల జరిమానా విధించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. ఆదేశాలు కచ్చితంగా అమలు చేయాలని డీజీపీ, కలెక్టర్లు, పోలీసులు, ఉన్నతాధికారులకు సూచించింది.
  Published by:Sumanth Kanukula
  First published: