రైతులతో సంతకాలు పెట్టించుకుని మిల్లర్లు దోపిడీ చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో రైతులను మిల్లర్లు దోచుకొంటే, జిల్లాలో ఉన్న పౌరసరఫరాల శాఖ మంత్రి కి విషయం తెలియదా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ‘రైతులతో సంతకాలు పెట్టించుకుంటూ మిల్లర్లు దోపిడీ చేస్తున్నారు. అగ్గి తెగులు, చీడపురుగు రావడంతో రైతులు ఎకరానికి రూ.15 వేలు నష్టపోతున్నారు. ప్రభుత్వం వారికి అండగా నిలవాల్సింది ఉంటుంది. ప్రతి పక్ష పార్టీ లు విమర్శితే ప్రతివిమర్శ చేస్తున్నారు తప్ప సమస్యను తీర్చడం లేదు. రైతులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తాం.’ అని జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో రైతుల సమస్యలపై అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య విమర్శల దాడి కొనసాగుతోంది. రైతులు పండించిన పంటను మొత్తం కొనుగోలు చేస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని సీఎం కేసీఆర్ అన్నారు. అయితే, కొందరు చిల్లర రాజకీయాలు చేస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని, వారి మాటలు నమ్మి ధాన్యాన్ని తగలబెడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల మాటలు నమ్మొద్దని సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Farmers, Jeevan reddy, Telangana