MLC elections : ముగిసిన ఎన్నికలు... ఖమ్మంలో ఉద్రిక్తత..14న ఫలితాలు
mlc elections
MLC elections : ఒకటి రెండు చోట్ల స్వల్ప ఘర్షణలు మినహా స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాయి. మొత్తం ఐదు జిల్లాల్లో ఆరు స్థానాలకు నేడు పోలింగ్ జరిగింది. కాగా 14న ఫలితాలు వెలువడనున్నాయి.
గత నెల రోజులుగా కొనసాగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల కోలహాలం ముగిసింది. మొత్తం ఆరు స్థానాలకు గాను ఐదు జిల్లాల్లో పోలీంగ్ జరిగింది. పోలింగ్ జరిగిన జిల్లాల్లో కరీంనగర్‌లో రెండు స్థానాలు ఉండగా,మెదక్, నల్గొండ, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఓక్కో స్థానానికి ఎన్నికలు జరిగాయి. కాగా ఎన్నికల్లో భాగంగా క్యాంపులకు వెళ్లిన అధికార పార్టీ సభ్యులు, నేతలు నేరుగా పోలీంగ్ కేంద్రాలకు బస్సుల్లో చేరారు. దీంతో ఉదయం పదిగంటలకు ఒక్కసారిగా ఓటర్లు భారీ క్యూలో నిలుచుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీకి పోటిగా ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో నిలవడంతో అక్కడి నేతలు చాలా టెన్షన్ పడ్డారు. ఓటర్లను క్యాంపులకు తీసుకెళ్లడంతో పాటు దగ్గరుండి పోలింగ్ స్టేషన్లకు వారిని చేర్చారు. కాగా జరిగిన ఎన్నికల్లో ఖమ్మం మినహా ఎలాంటీ అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు..కాగా ఈ సారి ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాకు ప్రజా ప్రతినిధులకు కూడా ఓటింగ్ కల్పించడతో చాలా మందిమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అయితే ఎన్నికలు పలు జిల్లాల్లో సజావుగా కొనసాగినా.. ఖమ్మం జిల్లాలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. ఎన్నికల సరళిపై ఆ పార్టీ నేతలు ఆందోళన చేపట్టెందుకు రావడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. దీంతోపాటు ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉన్న కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆ పార్టీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిరసన వ్యక్తం చేశారు.
అయితే ఖమ్మంలో నిర్వహించిన పోలింగ్‌లో స్థానిక మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తోపాటు ఇతర నేతలు పోలీంగ్ బూతులోనే సుమారు మూడు గంటల పాటు ఉండడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వారు పోలింగ్ స్టేషన్‌కు వెళ్లి ఆందోళన నిర్వహించారు. అధికార పార్టీ నేతలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని వారు ఆరోపించారు. వీరికి పోలీసులు కూడా సహకరించారని భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ సంఘటనపై రాష్ట్ర ఎన్నికల కమీషన్‌తో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.