• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • MLC BHUPALREDDY ELECTED AS PRO TEM CHAIRMAN OF LEGISLATIVE COUNCIL OF TELANGANA VRY

Telangana Council :మండలి ప్రోటెం చైర్మన్‌గా ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి.. ముగిసిన 5గురు ఎమ్మెల్సీల పదవికాలం

మండలి ప్రోటెం చైర్మన్‌గా ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి

Telangana Council : తెలంగాణ శాసన మండలి ప్రో టెం చైర్మన్‌గా ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని నియమించారు..నేటితో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు వైస్ చైర్మన్ విద్యాసాగర్ పదవి కాలం ముగియడంతో భూపాల్‌రెడ్డిని నియమిస్తూ శాసన సభ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు.

  • Share this:
తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్‌ల ఎమ్మెల్సీ సభ్యత్వ కాలం నేటితో ముగిసింది..దీంతో ప్రోటెం చైర్మన్‌గా మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని నియమించారు.. రాష్ట్ర ప్రభుత్వ సిఫారసును గవర్నర్ తమిలి సై అమోదించి నోటిఫికేషన్ సైతం జారీ చేశారు. ప్రొటెం చైర్మత్‌తో పాటు నూతన సభ్యులను సైతం ప్రమాణ స్వీకారం చేసే బాధ్యతను అప్పగించారు.

ప్రోటెం చైర్మన్‌గా భూపాల్ రెడ్డి నియామకం కావడంతో శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు ఆయన పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. భూపాల్ రెడ్డి 2007 నుండి రాష్ట్ర శాసన మండలి సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఇక 2007లోనే అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శాసన మండలిని 2007లోనే పునరిద్దరించగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన భూపాల్ రెడ్డి 2018 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

కాగా ప్రస్తుతం కొనసాగుతున్న శాసన మండలి చైర్మన్‌ ,వైస్ చైర్మన్‌తో పాటు మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆకుల లలితా, ఫరీదుద్దీన్‌ల ఎమ్మెల్సీ పదవి కాలం కూడా నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా వారికి వీడ్కోలు సమావేశం కూడ జరిగింది..ఈ కార్యక్రమానికి శాసన సభ వ్యవహరాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిధిగా హజరుగా వారిని ఘనంగా సన్మానించారు.
Published by:yveerash yveerash
First published: