రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సెన్సేషనల్ గా మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (TRS MLAs Poaching Case)లో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా రామచంద్రభారతీ, నందకుమార్, సింహయాజి ఉన్నారు. వీరికి నిన్న షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. ఈ కేసులో దర్యాప్తుకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ (Hyderabad) సీపీ సీవీ ఆనంద్ తో సహా పలువురితో కూడిన కమిటీని నియమించింది. సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. తాజాగా తెలంగాణ హైకోర్టు (Telangana High Court)కు సమర్పించిన నివేదికలో విస్తుపోయే అంశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ డీల్ కు ముందు రామచంద్రభారతీ, బీజేపీ అగ్రనేత BL సంతోష్ వాట్సప్ చాటింగ్ లో సంచలన విషయాలు బయటపడ్డాయి.
నలుగురు కాదు 40 మంది ఎమ్మెల్యేల టార్గెట్..
అక్టోబర్ 26న మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైలట్ రోహీత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డిని పార్టీ మారాలని భారీ డీల్ ను నిందితులు తీసుకొచ్చారు. ఇది ఇప్పటివరకు బయటకు వచ్చిన నిజం. కానీ హైకోర్టుకు సిట్ సమర్పించిన నివేదికలో అంశాలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారాయి. కేవలం నలుగురు ఎమ్మెల్యేలే కాదు మొత్తం 40 మంది ఎమ్మెల్యేలను చేర్చుకునేలా ప్లాన్ చేసినట్టు నిందితుడు రామచంద్రభారతీ, BL సంతోష్ వాట్సప్ చాటింగ్ లో బయటపడినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు 25 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని, మిగతా వారితో చర్చలు జరుపుతున్నట్టు సిట్ నివేదికలో పేర్కొంది. అలా అయితే విడతల వారిగా ఎమ్మెల్యేలను చేర్చుకోడానికి చూసినట్టు తెలుస్తుంది.
YS Sharmila: షర్మిలకు ఇప్పటికైనా పొలిటికల్ మైలేజీ వస్తుందా ? ఆ పరిస్థితి మారకపోతే అంతేనా ?
ఇతర పార్టీల నేతలు..మాజీ డిప్యూటీ సీఎం..లిస్ట్ ఇదే
అయితే ఈ డీల్ లో కేవలం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాదు ఇతర పార్టీల నాయకులను చేర్చుకునేలా చూశారు. అందులో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కూడా లిస్ట్ లో ఉన్నారు. అలాగే జూబ్లీహిల్స్, ఎల్బీనగర్, జనగాం, భద్రాచలం, పటాన్ చెర్వు, నిజామాబాద్ , కామారెడ్డి , నిర్మల్ , చెన్నూరు, సంగారెడ్డి, పెద్దపల్లి సహా పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేల పేర్లను వాట్సప్ చాటింగ్ లో సిట్ అధికారులు గుర్తించారు.
మరి రానున్న రోజుల్లో ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో ఇంకెన్ని సంచలనాలు బయటకు వస్తాయో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Hyderabad, Telangana, Telangana News, TRS MLAs Poaching Case