MLA SEETHAKKA VISIT GOVERNMENT GIRLS SCHOOL AND TEACHES LESSONS TO STUDENTS SU
MLA Seethakka: సర్కార్ బడిలో ఎమ్మెల్యే సీతక్క పాఠాలు.. విద్యార్థులకు ఏ పాఠం చెప్పారంటే.. వీడియో
పాఠం చెప్తున్న సీతక్క
ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రజల మనిషిగా మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఆమె అసలు పేరు ధనసరి అనసూయ అయినప్పటికీ.. మావోయిస్టు ఉద్యమంలో పాల్గొనప్పటి నుంచి ఆమె పేరు సీతక్కగా మారింది.
ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రజల మనిషిగా మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఆమె అసలు పేరు ధనసరి అనసూయ అయినప్పటికీ.. మావోయిస్టు ఉద్యమంలో పాల్గొనప్పటి నుంచి ఆమె పేరు సీతక్కగా మారింది. ఆ ఉద్యమం నుంచి బయటికివచ్చినప్పటికీ ఆమెను అందరూ సీతక్కగానే పిలుచుకుంటున్నారు. కరోనా కాలంలో ములుగు నియోజకవర్గంలోని పేదలకు సీతక్క తన వంతు సాయం అందించారు. లాక్డౌన్ సమయంలో తానే స్వయంగా ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించి అక్కడి ప్రజలకు తన శక్తిమేరకు బియ్యం, కూరగాయలు అందజేసి పలువురి ప్రశంసలు అందుకున్నారు. నిత్యం ప్రజల మధ్యలో ఉంటారని పేరు తెచ్చుకున్నారు సీతక్క. తాజాగా సీతక్క ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్పారు.
కరోనా లాక్డౌన్ సమయంలో మూతపడిన పాఠశాలలు కొద్ది రోజుల కిందటే తెరుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఓ ప్రభుత్వ బాలికల పాఠశాలలకు వెళ్లిన సీతక్క అక్కడ ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల భద్రత కోసం తీసుకుంటున్న జాగ్రత్త చర్యలను ఆమె పరీశిలించారు. విద్యార్థినిలకు పీరియడ్స్ సమయంలో అంటువ్యాధుల గురించి అవగాహన కల్పించడంతో పాటుగా, శానిటరీ న్యాప్కిన్లను పంపిణీ చేసినట్టుగా సీతక్క తెలిపారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు.
ఇక, సాంఘిక శాస్త్రంలోని ఎవరి అభివృద్ధి? అనే పాఠాన్ని సీతక్క విద్యార్థులకు బోధించారు. ప్రజల అభిప్రాయం మేరకు అభివృద్ధి సాధించినప్పుడే సమసమాజం సాధ్యమవుతుందని విద్యార్థులకు వివరించారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.