Seetakka : అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే సీతక్క.. దళిత గిరిజన దండోర సభలో సంఘటన

seetakka

Seetakka Illness : ములుగు ఎమ్మెల్యే సీతక్క అస్వస్థతకు గురయ్యింది. ఏటూర్‌నాగారంలో మండల కేంద్రంలో నిర్వహిస్తున్న దళిత గిరిజన దండోర యాత్రలోనే ఆమె స్పృహ తప్పి కింద పడిపోయారు. దీంతో సీతక్కను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే లో బీపీతో కింద పడిపోయిందని ఇప్పుడు పరిస్థితి బాగానే ఉందని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు.

  • Share this:
    ములుగు ఎమ్మెల్యే సీతక్క( MLA Seetakka) అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని ఎటూర్‌నాగారం మండల కేంద్రంలో నిర్వహించిన దళిత గిరిజన దండోరా (Dalita girijana Dandora )యాత్రలో ఆమె పాల్గొన్న సమయంలో ఆమె ఆనారోగ్యానికి గురైనట్టు తెలుస్తోంది,. కాగా, దండోరా అనంతరం స్థానిక తహసీల్దాలర్‌కు(mro) వినతిపత్రం అందించే సమయంలోనే అస్వస్థతకు గురై ఎమ్మెల్యే సీతక్క కిందపడిపడిపోయినట్టు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన వెంటనే కాంగ్రెస్(congress) నాయకులు ఆమెను ఏటూరు నాగారం (Eturunagaram) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే లో బీపీతో కింద పడిపోయిందని ఇప్పుడు పరిస్థితి బాగానే ఉందని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు.

    అయితే కొద్ది సేపటి తర్వాత ప్రాధమిక చికిత్స అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కాగా ఇటివల జరుగుతున్న పార్టీ కార్యక్రమాల్లో సీతక్క బిజీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే సంఘటనలపై స్పందిస్తున్న సీతక్క స్పాట్‌కు చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు.

    ఇది చదవండి : లడ్డూ తెచ్చిన తంట...! అప్పులు ఉన్నా.. వేలం పాటలో భర్త, చివరికి.. ?






    ఈ క్రమంలోనేడు ఓ బాలికపై తండ్రి చేసిన దశ్చర్యను అంతకు ముందే ఆమె తీవ్రంగా ఖండించారు. మరోవైపు నేడు మెదక్‌లో(medak) మూడేళ్ల పాలను చిత్రహింసలకు గురిచేసిన వాడిని కేసులు పెట్టి శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా మెదక్ జిల్లాలోని మున్సిపాలిటి ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్న నాగరాజు అనే వ్యక్తి ఇటివల రెండో వివాహం చేసుకున్నాడు. అయితే మొదటి భార్యకు ఓ కూతురు ఉండగానే రెండో వివాహం చేసుకున్న నాగరాజు (nagaraju)ఆ చిన్నారీ అనేక చిత్రహింసలకు గురి చేయడం అలవాటుగా మారిపోయింది.

    ఇది చదవండి : పీజీ చేసి.. రోడ్లపై చీపురు పట్టింది.. స్వీపర్ నుండి ఎంటమాలజిస్టుగా మారింది..


    అయితే ఇటివలే చిన్నారీని తాడుతో కొట్టడడంతో పాటు పైకెత్తి నేలకు కొట్టడం స్థానికులు చూసి ఆ సంఘటనను రికార్డు చేశారు. మరోపక్క సవతి తల్లి(step mother) కూడా పక్కనే ఉండడం భర్త అలా చేస్తూంటే వద్దని వారించకుండా పక్కనే ఉండి నవ్వుతూ కనిపిస్తోంది. దీంతో ఆ వీడియో వైరల్ కావడంతో సీతక్క ఫేస్ బుక్( face book) వేదికగా స్పందించింది. వెంటనే నాగరాజును కఠినంగా శిక్షించాలని ఆమె పోలీసులను కోరింది.

    ఇది చదవండి : రేవంత్ రెడ్డి ఇంటివద్ద ఉద్రిక్తత.. టీఆర్ఎస్, కాంగ్రేస్ పార్టీల మధ్య కర్రలతో దాడులు.!

    Published by:yveerash yveerash
    First published: