హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : తెప్పపై వాగు దాటిన లేడీ ఎమ్మెల్యే .. అందుకోసం అంత రిస్క్ చేశారా..!

Telangana : తెప్పపై వాగు దాటిన లేడీ ఎమ్మెల్యే .. అందుకోసం అంత రిస్క్ చేశారా..!

(MLA Rekhanayak)

(MLA Rekhanayak)

Telangana: తెలంగాణలో ఇప్పటి వరకు అలాంటి లేడీ ఎమ్మెల్యే ఒక్కరే ఉన్నారు. కాని ఇప్పుడు ఆమె బాటలో మరొకరు చేరారు. ఓట్లేసి గెలిపించిన ప్రజల కష్ట, సుఖాలు తెలుసుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగడమే కాకుండా..వాగులు, చెరువులు దాటుకుంటూ వెళ్లి ప్రజల్ని పరామర్శించారు. ఇంతకీ ఆ లేడీ ఎమ్మెల్యే ఎవరంటే.

ఇంకా చదవండి ...

ప్రజల అవసరాలు ఏంటి..? వాళ్లకున్న సమస్యలు ఎలాంటివి..? విపత్తులు, వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారనే విషయాల్ని పరిశీలించడం, ప్రత్యక్షంగా చూసి వారిని పరామర్శించడం ప్రజాప్రతినిధుల కర్తవ్యం. ఎందుకంటే ఓట్లేసి గెలిపించేది ప్రజలే కాబట్టి వాళ్ల బాగోగులు చూడాల్సింది ప్రజాప్రతినిధులే. నిర్మల్(Nirmal)జిల్లా ఖానాపూర్(Khanapur)ఎమ్మెల్యే(MLA) రేఖానాయక్ (Rekhanayak)ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు. తన నియోజకవర్గ పరిధిలోని ముంపునకు గురైన గ్రామాలు, నీట మునిగిన పంటలను పరిశీలించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే రోడ్డు మార్గం దెబ్బతిన్నప్పటికి తన పర్యటనను సాహసోపేతంగా ముగించారు.

Telangana : సంక్రమణ లేకుండానే పశువుల్లో సంతానోత్పత్తి .. సరోగసి ద్వారా సక్సెస్‌ చేశారుగా ..



ఎమ్మెల్యే చొరవ..

నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్ గురువారం నియోజకవర్గ పరిధిలో పర్యటించారు. డైలీ పర్యటనలా కాకుండా అత్యంత ప్రమాదకరమైన పర్యటన చేపట్టారు. ఖానాపూర్ మండలంలోని బీర్నంది నుంచి కడెం వాగు వద్దకు మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకున్నారు ఎమ్మెల్యే రేఖానాయక్‌. భారీ వరదలకు అక్కడ నిర్మిస్తున్న వంతెన కూలిపోవడంతో వర్షంలో తడుస్తూనే తెప్పపై గంగాపూర్‌ వాగు దాటారు. ఆ తర్వాత ఎడ్లబండిపై మరో వాగును దాటి గ్రామానికి చేరుకొన్నారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి.. ప్రభుత్వపరంగా ఆదుకుంటామని రైతులకు భరోసా ఇచ్చారు.

తెప్పపై వాగు దాటిన రేఖానాయక్..

అటుపై గంగాపూర్‌లో పర్యటించిన మహిళా ఎమ్మెల్యే రాణిగూడ, బాబానాయక్‌ తండా, అల్లంపల్లి, మీసాల భూమన్నగూడం గ్రామాల ప్రజలతో సమావేశమయ్యారు. వంతెన లేకపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆయా గ్రామాల ప్రజలు ఆమె దృష్టికి తీసుకొచ్చారు.స్థానికులు చెప్పిన సమస్యలను ఆలకించారు. గంగాపూర్‌ వంతెన రీ డిజైన్‌ చేసి పనులు ప్రారంభించాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీఇచ్చారు. వాతావరణం అనుకూలంగా లేని పరిస్థితుల్లో అంత దూరం వెళ్లిన ఎమ్మెల్యే అక్కడి స్థానికుల హృదయాల్లో చోటు సంపాధించుకున్నారు.

Telangana : ప్రాజెక్టు ఆనకట్ట సేఫ్టీ కోసం పాలిథిన్ కవర్‌ .. పాలకుల నిర్లక్ష్యానికి ఇదే చక్కని ఉదాహరణ



ఓట్ల కోసమేనా..

గత 10రోజుల క్రితం కూడా వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, గ్రామాలను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో కలిసి రేఖానాయక్ ఇంద్రవెల్లి, ఉట్నూరు మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఉట్నూరు మండలం వడ్‌గావ్ నుండి పాటగూడ, హీరాపూర్, లాల్ టేకిడి వరకు ఆటోలో ప్రయాణించారు. తెలంగాణలో ఈతరహాలో ప్రజల సమస్యలు తెలుసుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఆమె ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే కావడం..ఆదివాసీ బిడ్డ కావడం వల్ల వాళ్ల బాధలు, సమస్యలు స్వయంగా వెళ్లి తెలుసుకుంటారు. ఇప్పుడు సీతక్క బాటలోనే ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కూడా చేరిపోయారు.

First published:

Tags: Nirmal district, Rekha naik, Telangana News

ఉత్తమ కథలు