టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ సిట్ కు హైకోర్టు షాకిచ్చింది. నేడు ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు తుషార్ ను అరెస్ట్ చేయొద్దని వ్యాఖ్యానించింది. కానీ విచారణకు తుషార్ సహకరించాలని కోర్టు పేర్కొంది. అభ్యంతరాలు ఉంటే హైకోర్టును ఆశ్రయించాలని తెలిపింది. తదుపరి విచారణ మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.
ఆ ముగ్గురికి నోటీసులు..
ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో బీజేపీ అగ్రనేత BL సంతోష్, కేరళకు చెందిన తుషార్, జగ్గుస్వామిలకు సిట్ నోటీసులు ఇచ్చింది. ముగ్గురు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. కానీ ముగ్గురు కూడా సిట్ విచారణకు హాజరు కాలేదు. ఈ క్రమంలో తెలంగాణ సిట్ తదుపరి చర్యలు తీసుకుంది. తుషార్, జగ్గుస్వామిలపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీనితో తుషార్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ఆరోగ్యం బాగాలేదని, రేండు వారాలు సమయం కావాలని నేను సిట్ కు మెయిల్ చేశానని తుషార్ చెప్పుకొచ్చారు. కానీ ఇంతలోనే లుకౌట్ నోటీసులు ఇచ్చారని తుషార్ చెప్పుకొచ్చారు. ఇక దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తుషార్ ను అరెస్ట్ చేయొద్దని కోరింది.
ఇక ఈ కేసులో ఇటీవల మరో ఇద్దరికీ సిట్ నోటీసులు ఇచ్చింది సిట్. అందులో ఒకరు నిందితుల్లో ఒకరైన నందకుమార్ భార్య కాగా మరొకరు అంబర్ పేటకు చెందిన లాయర్ ప్రతాప్ గౌడ్. వీరిలో నందకుమార్ భార్య విచారణకు నోటీసుల్లో పేర్కొన్న తేదీన రాలేనని, వేరే తేదీలో వస్తానని సిట్ కు చెప్పుకొచ్చింది. ఇక లాయర్ ప్రతాప్ నోటీసులపై హైకోర్టు (High Court) కు వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ప్రతాప్ తరపు వాదనలు విని కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రతాప్ ను అరెస్ట్ చేయొద్దని, నోటీసుల్లో పేర్కొన్న తేదీల్లో విచారణకు హాజరు కావాలని హైకోర్టు (High Court) తెలిపింది. ఈ మేరకు నందకుమార్ భార్య, ప్రతాప్ గౌడ్ సిట్ విచారణకు హాజరయ్యారు.
తెలంగాణ సిట్ కు వరుస షాకులు..
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ సిట్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిల కస్టడీ 10 రోజుల పాటు పొడగింపు కావాలని సిట్ ఏసీబీ కోర్టు (Acb Court) ను ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కస్టడీ పొడిగింపు పిటీషన్ ను కొట్టేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telangana, TRS MLAs Poaching Case