ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసుకు సంబంధించి BL సంతోష్, జగ్గుస్వామి, శ్రీనివాస్ ను నిందితులుగా చేరుస్తు సిట్ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు (Acb Court) కొట్టివేసింది. అలాగే ఈ కేసు విచారణ చేపడుతున్న సిట్ కు లా అండ్ ఆర్డర్ ప్రకారం ఎలాంటి అధికారం లేదని ఏసీబీ కోర్టు (Acb Court) పేర్కొంది. అలాగే BL సంతోష్, శ్రీనివాస్, జగ్గుస్వామిని నిందితులుగా పరిగణించలేమని ఏసీబీ కోర్టు (Acb Court) తెలిపింది. కేసును విచారించడానికి ఏసీబీకే అధికారం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ఏసీబీ కోర్టు (Acb Court) తీర్పుపై సిట్ హైకోర్టు (High Court)ను ఆశ్రయించింది. ఈ మేరకు హైకోర్టు (High Court)లో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపింది హైకోర్టు.
ఈ సందర్బంగా వాదనలు వినిపించిన అడ్వకెట్ జనరల్ ఏసీబీ కోర్టు (Acb Court) వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. కోర్టు పరిధి ధాటి వ్యవహరించిందని, ఏసీబీ కోర్టు (Acb Court)కు సిట్ మెమోను రిజెక్ట్ చేసే అధికారం ఉన్నప్పటికీ ఏసీబీ కోర్టు (Acb Court) ఇచ్చిన ఆర్డర్ క్వాష్ పిటీషన్ లా ఉందని అన్నారు. మరోవైపు ప్రతివాదుల తరపు న్యాయవాది ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆర్డర్ ను సమర్ధించారు. ఈ క్రమంలో రివిజన్ పిటీషన్ కాపీని ప్రతివాదులకు అందజేయాలని హైకోర్టు చెప్పుకొచ్చింది. కాగా తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
సిట్ కు వరుస షాకులు..
ఇక TRS ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ అగ్రనేత BL సంతోష్, జగ్గుస్వామిలకు తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) నిన్న ఊరట లభించింది. ఈ కేసులో వీరిపై సిట్ జారీ చేసిన నోటిసులపై స్టేను డిసెంబర్ 13 వరకు పొడిగించింది. మొదట ఈ నోటిసులపై సంతోష్ హైకోర్టు (High Court)ను ఆశ్రయించగా..డిసెంబర్ 5 వరకు నోటిసులపై స్టే విధించింది. దీనితో నేడు విచారణ చేపట్టిన హైకోర్టు (High Court) డిసెంబర్ 13 వరకు స్టేను పొడిగించింది. మరోవైపు జగ్గుస్వామి (Jaggu Swami) సిట్ లుకౌట్ నోటిసులపై హైకోర్టు (High Court)ను ఆశ్రయించారు.
దీనిలో కూడా నోటిసులపై స్టేను హైకోర్టు (High Court) పొడిగించింది. ఇప్పుడు శ్రీనివాస్ పై మెమో దాఖలును కొట్టివేయడంతో పోలీసులకు చుక్కెదురైంది. మరి రేపు ఏసీబీ కోర్టు తీర్పుపై హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Telangana, Telangana News, TRS MLAs Poaching Case