హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..చంచల్ గూడ జైలు నుంచి నిందితులు విడుదల..వెంటనే మళ్లీ అరెస్ట్

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..చంచల్ గూడ జైలు నుంచి నిందితులు విడుదల..వెంటనే మళ్లీ అరెస్ట్

చంచల్ గూడ జైలు నుంచి నిందితులు విడుదల

చంచల్ గూడ జైలు నుంచి నిందితులు విడుదల

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (TRS MLAs Poaching Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రామచంద్రభారతీ (Rama chandra bharathi), నందకుమార్ (Nandhakumar), సింహయాజి (Simhayaji)లకు ఇటీవల హైకోర్టు (High Court) షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. ఈ మేరకు నిన్న సింహయాజి (Simhayaji) జైలు నుంచి విడుదల కాగా నేడు రామచంద్రభారతీ (Rama chandra bharathi), నందకుమార్ (Nandhakumar) చంచల్ గూడ జైలు నుండి విడుదల అయ్యారు. అయితే రామచంద్రభారతీ (Rama chandra bharathi), నందకుమార్ (Nandhakumar) పై ఇతర కేసులు ఉండడంతో వారిని పోలీసులు మళ్లీ అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (TRS MLAs Poaching Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రామచంద్రభారతీ (Rama chandra bharathi), నందకుమార్ (Nandhakumar), సింహయాజి (Simhayaji)లకు ఇటీవల హైకోర్టు (High Court) షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. ఈ మేరకు నిన్న సింహయాజి (Simhayaji) జైలు నుంచి విడుదల కాగా నేడు రామచంద్రభారతీ (Rama chandra bharathi), నందకుమార్ (Nandhakumar) చంచల్ గూడ జైలు నుండి విడుదల అయ్యారు. అయితే రామచంద్రభారతీ (Rama chandra bharathi), నందకుమార్ (Nandhakumar) పై ఇతర కేసులు ఉండడంతో వారినిపోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు.

KCR Vs BJP: బీజేపీ టార్గెట్‌గా కేసీఆర్ పక్కా వ్యూహం.. టీఆర్ఎస్ అధినేత అంచనాలు నిజమవుతాయా ?

బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు..కానీ వర్తించనున్న ఆ షరతులు..

ఇక ఈ కేసులో నిందితులు ముగ్గురు రామచంద్రభారతీ (Rama chandra bharathi), నందకుమార్ (Nandhakumar), సింహయాజి (Simhayaji) బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు డిసెంబర్ 1న షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.  అయితే ఈ బెయిల్ మంజూరులో కొన్ని షరతులు పెట్టింది హైకోర్టు. ప్రతీ సోమవారం సిట్ (Special Investigaion Team) ముందుకు హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రూ.3 లక్షల పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ముగ్గురి పాస్ పోర్టులను కోర్టులో సరెండర్ చేయాలనీ, ఎట్టి పరిస్థితుల్లో దేశం విడిచి వెళ్లోద్దని హైకోర్టు  (Telangana High Court) పేర్కొంది. అలాగే సాక్షులను ప్రభావితం చేసేలా వ్యవహరించొద్దని కోర్టు ఆదేశించింది.

Karimnagar: నేడే జగిత్యాలకు సీఎం కెసిఆర్ రాక..పర్యటనను అడ్డుకోవాలని కాంగ్రెస్ నాయకుల పిలుపు

సిట్ కు షాకుల మీద షాకులు 

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి సిట్ (Special Investigaion Team) దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అలాగే ఈ కేసు విచారణ చేపడుతున్న సిట్ (Special Investigaion Team) కు లా అండ్ ఆర్డర్ ప్రకారం ఎలాంటి అధికారం లేదని ఏసీబీ కోర్టు (Acb Court) పేర్కొంది. అలాగే BL సంతోష్, శ్రీనివాస్, జగ్గుస్వామిని నిందితులుగా పరిగణించలేమని ఏసీబీ కోర్టు (Acb Court) తెలిపింది. కేసును విచారించడానికి ఏసీబీకే అధికారం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై రివిజన్ పిటీషన్ వేసిన సిట్ కోర్టు వ్యాఖ్యలను హైకోర్టులో  (Telangana High Court) సవాల్ చేసింది.

ఈ సందర్బంగా హైకోర్టులో వాదనలు వినిపించిన అడ్వకెట్ జనరల్ ఏసీబీ కోర్టు  (Acb Court) వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. కోర్టు పరిధి ధాటి వ్యవహరించిందని, ఏసీబీ కోర్టు  (Acb Court)కు సిట్ మెమోను రిజెక్ట్ చేసే అధికారం ఉన్నప్పటికీ ఏసీబీ కోర్టు (Acb Court) ఇచ్చిన ఆర్డర్ క్వాష్ పిటీషన్ లా ఉందని అన్నారు. మరోవైపు ప్రతివాదుల తరపు న్యాయవాది ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆర్డర్ ను సమర్ధించారు. ఈ క్రమంలో రివిజన్ పిటీషన్ కాపీని ప్రతివాదులకు అందజేయాలని హైకోర్టు చెప్పుకొచ్చింది. కాగా తదుపరి విచారణ ఇవాళ జరగనుంది.

First published:

Tags: Hyderabad, Telangana, Telangana News, TRS MLAs Poaching Case

ఉత్తమ కథలు