దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఎర కేసులో కొత్త కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న ఈ కేసులో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇప్పటివరకు ఈ కేసులో దర్యాప్తు చేసిన సిట్ నుయ్ రద్దు చేస్తూ సీబీఐకి అప్పగించింది. అయితే హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం డివిజన్ బెంచ్ కు వెళ్లేలా కనిపిస్తుంది. డివిజన్ బెంచ్ లో ఇదే అనుభవం ఎదురైతే సుప్రీంకోర్టుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ కేసులో ఫిర్యాదుదారునిగా ఉన్న తాండూరు బీఆర్.ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి (Pilot Rohith reddy)ని ఇటీవల ఈడీ అధికారులు రెండు రోజులు విచారించారు. విచారణ అనంతరం ఈనెల 27న మళ్లీ విచారణకు రావాలని ఆదేశించారు.
అయితే తాజా సమాచారం ప్రకారం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి (Pilot Rohith reddy) నేడు విచారణకు హాజరు కావడం లేదని తెలుస్తుంది. ఈ మేరకు ఈడీ అధికారులకు ఎమ్మెల్యే పైలట్ మెయిల్ చేసినట్టు సమాచారం. ఈ కేసులో తనను ఈడీ విచారించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి (Pilot Rohith reddy) రిట్ పిటీషన్ వేశారు. దీనిపై రేపు హైకోర్టు విచారించనుంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే నేడు ఈడీ విచారణకు హాజరు కావడం లేదని తెలుస్తుంది. మరి ఎమ్మెల్యే మెయిల్ పై ఈడీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. విచారణకు రావాలని ఆదేశిస్తుందా? లేక రేపు హైకోర్టులో విచారణ వరకు ఆగుతుందా అనేది చూడాల్సి ఉంది.
కాగా అక్టోబర్ 26న ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో నందకుమార్, సింహయాజి, రామచంద్రభారతీ భారీ డీల్ ను తీసుకొచ్చారు. ప్రభుత్వాన్ని కొల్లగొట్టాలనే ఉద్దేశ్యంతో ఈ వ్యవహారం జరిగింది. అయితే ఈ డీల్ ను ఎమ్మెల్యే రోహిత్ ఫిర్యాదుతో పోలీసులు భగ్నం చేశారు. ఈ కేసులో బేరసారాలు చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా ఈమధ్య బెయిల్ పై బయటకు వచ్చారు. కాగా ఈ కేసును దర్యాప్తు చేయడానికి సర్కార్ సిట్ ను ఏర్పాటు చేసింది. కానీ ఇటీవల అనూహ్యంగా ఈడీ ఇటు ఎమ్మెల్యేను, అటు నందకుమార్ ను విచారిస్తుండడం సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సీబీఐ ఎంట్రీతో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మరింత రసవత్తరంగా మారనుంది. ఈ కేసులో రానున్న రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓ వైపు ఈడీ, మరోవైపు సీబీఐ దర్యాప్తుతో ఈ కేసులో ఎలాంటి సంచలనాలు బయటకొస్తాయనేది ప్రస్తుతానికి సస్పెన్సే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, BRS, CBI, Enforcement Directorate, Telangana, TRS MLAs Poaching Case