MLA Bhagat assets : అడ్వకేట్‌గా.. ఎమ్మెల్యే నోముల భగత్ ఆస్తులు.. ?

సీఎం కేసీఆర్ తో ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్

MLA Bhagat assets : వ్యవసాయంతో పాటు అడ్వకేట్ గా తన వృత్తిని పేర్కోన్న భగత్‌తో పాటు ఆయన భార్య పేరున 4  కోట్ల రూపాయల ఆస్తులు ఉండగా మరో 80 లక్షల రూపాయల అప్పులు

  • Share this:
    టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గా నాగార్జున సాగర్ ఉప ఎన్నికల గెలుపోందిన నోముల భగత్ కమ్యూనిస్టు నాయకుడిగా ఉన్న నోముల నర్సింహయ్య మరణం తర్వాత ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి ఎంటర్ అయిన విషయం తెలిసిందే.  ఎన్నికల్లో పోటి చేసే అభ్యర్థులు  కొంతమంది నేతలు తమ ఆస్తుల వివరాలను కోట్ల రూపాయలుగా పూర్తిగా ఎన్నకల కమిషన్‌ ముందు పెడతారు.. మరి కొంతమంది మాత్రం తమకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా తన పేరు మీద ఏవి లేన్నట్టుగా పేర్కోంటారు. ఈనేపథ్యంలోనే భగత్ తనకు సుమారు నాలుగు కోట్ల రూపాలయ స్థిర, చర అస్తులు ఉన్నట్టు పేర్కోన్నారు.

    వ్యవసాయంతో పాటు అడ్వకేట్ గా తన వృత్తిని పేర్కోన్న భగత్‌తో పాటు ఆయన భార్య పేరున 4  కోట్ల రూపాయల ఆస్తులు ఉండగా మరో 80 లక్షల రూపాయల అప్పులు ఉన్నట్టు తెలిపారు. కాగా ఇద్దరికి కలిపి  మూడు వాహానాలు ఉన్నట్టు పేర్కోన్నారు. మరోవైపు ఆయన పేరుమీద 16.5 ఎకరాలు ఉండగా ఆయన భార్య పేరుమీద అర ఎకరం వ్యవసాయ భూమి ఉందని పేర్కోన్నారు. ఇవే కాక మరికొన్ని స్థిరాస్థులు కూడ ఉన్నట్టు అఫిడవిట్‌లో పేర్కోన్నారు.

    ఉప ఎన్నికల్లో పోటిచేసిన నోముల భగత్ ఆస్తుల వివరాలను ఎన్నికల కమిషన్‌కు అందించారు. ప్రస్తుతం ఆస్తులు అప్పుల విషయంలో సీనియర్ నేతలకు సంబంధించి చర్చనీయాంశంగా మారిన   నేపథ్యంలోనే ఎమ్మెల్యే భగత్‌కు 55 లక్షల 33వేల 719 రూపాయల చరాస్థి ఉండగా 30, 32,000 వేల రూపాయల స్థిరాస్థి ఉంది.

    కాగా ఆయన భార్య భవాని పేరిట 71 లక్షల 84 వేల 650 రూపాయల చరాస్థి, 1 లక్ష 75 వేల రూపాయల స్థిరాస్థి ఉన్నట్టు పేర్కోన్నారు. కాగా భగత్ పేరుమీద 16.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా ఆయన భార్యకు అర ఎకరం ఉన్నట్టు తెలిపారు. వీటి విలువ ఒక కోటి రూపాయల వరకు ఉన్నట్టు చెప్పారు. ఇంతే కాకుండా పలు ప్రాంతాల్లో వ్యవయోతర ఆస్తులు కూడ ఉన్నట్టు పేర్కోన్నారు.

    ఇక చేతిలో నగదు 19000 రూపాయలు ఉండగా మరో మూడు లక్షల రూపాయలు బ్యాంకులో ఉన్నట్టు పేర్కోన్నారు. ఇక ఆయన భార్య పేరిట కూడ 15వేల నగదు, బ్యాంకుల్లో సుమారు 16 లక్షల రూపాయలు ఉన్నట్టు చెప్పారు. మరోవైపు ఇద్దరి పేరిట 84 లక్షల 52 వేల రూపాయల అప్పులు ఉన్నట్టు పేర్కోన్నారు. కాగా భగత్ పేరు మీద 24 లక్షల 52 వేలు , భార్య పేరు మీద 60 లక్షల లోన్స్ ఉన్నట్టు తెలిపారు.
    Published by:yveerash yveerash
    First published: