Home /News /telangana /

MLA JEEVAN REDDY FIRES ON MP ARVIND VRY

TRS vs BJP : బీజేపీని మించిన ఉగ్రవాద పార్టీ మరేదీ లేదు.. రైతులను ఉగ్రవాదులుగా పోలుస్తారా...?

ఫైల్ ఫోటో

ఫైల్ ఫోటో

TRS vs BJP : ఎంపీ అర్వీంద్ చేస్తున్న ఆరోపణలు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మరోసారి తిప్పికొట్టారు.. ఆర్మూర్ నియోజకవర్గం లో ఎంపీ అరవింద్ బాండ్ పేపర్ రాసిచ్చి నిలబెట్టుకోనందుకే గత రెండేళ్లుగా రైతులు ఆయన్ను నిలదీస్తున్నారని అన్నారు.

ఇంకా చదవండి ...
  టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎంపీ అర్వింద్‌పై మరోసారి మండిపడ్డారు. ఎంపీ అర్వింద్ పై ఒక్క అర్మూర్ రైతులే కాక.. పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని రైతులందరూ నిలదీస్తున్నారని అన్నారు. అయితే ఆయనకు ఏదో జరిగినట్టు బండి సంజయ్ ఆర్మూర్ కు పరామర్శ కు వచ్చారని చెప్పారు.

  ఆర్మూర్ లో బండి సంజయ్ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తెలిపారు. రైతులను ఖలిస్తాన్ ఉగ్రవాదులతో పోల్చడం సరికాదని అన్నారు. బీజేపీ ని మించిన ఉగ్రవాద పార్టీ మరేదీ లేదని విమర్శించారు. ఆ పార్టీ ఉగ్రవాదుల కర్మాగారంగా మారిందని ఆరోపించారు. ఉగ్రవాద స్వభావం ఉన్న వారే రైతులను ఉగ్రవాదులతో ఎలా పోలుస్తారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేంకంగా నిరసనలు చేసిన 700 మంది రైతులను బీజేపీ కబ్రస్థాన్ కు పంపిందని ఆరోపించారు. ఆ పార్టే ఇప్పుడు ఖలిస్తాన్ గురించి మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు.

  Waranagal : ప్రియుడి డబ్బుతోనే కిడ్నాప్..భయపెట్టి, బలవంతంగా.. అడవిలోకి తీసుకువెళ్లింది..ఆ తర్వాత..

  ప్రధాని నరేంద్ర మోడీ ఏ రోటి కాడ ఆ పాట పాడుతున్నారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. ప్రధాని మోడీ మొన్న ఉత్తరాఖండ్ వెళ్లినప్పుడు ఓ గెటప్, నిన్న పంజాబ్ లో మరో వేశారని అన్నారు. ఎన్నికల కోసం ఆయన నాటకాలు ఆడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. సీఎం కేసీఆర్ ది తెలంగాణ ను నిలబెట్టే విధానమని, బీజేపీ దని విమర్శించారు. రైతులను ఉగ్రవాదులు అని వ్యాఖ్యానిస్తే బండి సంజయ్ ఎక్కడా తిరగలేరని అన్నారు. బండి సంజయ్ కిరాయి మూకలే ఆర్మూర్ కు వెళ్లారని, ఆయన వెంట రైతులెవరూ లేరని అన్నారు.

  నిజమైన దేశ ద్రోహులు బీజేపీ నాయకులే అని జీవన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికలు రాగానే పాకిస్తాన్, ఖలిస్తాన్ అంటూ బీజేపీ ప్రజలను రెచ్చగొడుతుందని తెలిపారు. తెలంగాణ రైతుల విషయంలో బండి సంజయ్ కు చిత్తశుద్ది ఉంటే పసుపు బోర్డు తీసుకురావాలని అన్నారు.

  Hyderabad : మైనర్ బాలిక ఒంటిపై పంటిగాట్లు..! ఆరు నెలలుగా బిల్డింగ్ పైకి తీసుకువెళ్లి.

  ఓట్లు, సీట్ల కోసం కాకుండా బీజేపీ ప్రజల గురించి ఆలోచించాలని అన్నారు. పెట్రో ఉత్పత్తుల ధరలు మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వం పెంచిందని అన్నారు. అయితే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినా.. ఎన్నికలు ఉన్నాయనే కారణంతో పెట్రోల్ ధరలు పెంచడం లేదని ఆరోపించారు. ఎన్నికలు ముగియగానే పెట్రో పిడుగు పడడం ఖాయమని విమర్శించారు. కేసీఆర్ పై బీజేపీ వాడే భాషను మార్చుకోకపోతే తమ టీఆర్ఎస్ సైన్యం ఊరుకోదని అన్నారు. కేసీఆర్ రైతుల పక్షపాతి అని, అందుకే తెలంగాణ సమాజం ఆయన వెంట ఉందని అన్నారు.

  ఇక నుంచి రాష్ట్రంలో గంజాయి ఉండదని, భవిష్యత్ లో బండి సంజయ్ కు రాజకీయ జీవితం కూడా ఉండదని అన్నారు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య సేవలు మెరుగు పర్చేందుకు జిల్లాలకు వెళ్తున్న మంత్రి హరీష్ రావు ను బీజేపీ అడ్డుకోవడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. తప్పుడు పనులకు పాల్పడుతున్నబీజేపీ నాయకులపై చట్ట ప్రకారం కేసులు పెడతామని జీవన్ రెడ్డి హెచ్చరించారు.
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Dharmapuri aravind, Jeevan reddy

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు