హోమ్ /వార్తలు /తెలంగాణ /

MLA Jaggareddy : మంత్రి హరీష్‌రావు.. ఇలా చేస్తే.. ఎమ్మెల్సీగా పోటి నుండి విత్ డ్రా

MLA Jaggareddy : మంత్రి హరీష్‌రావు.. ఇలా చేస్తే.. ఎమ్మెల్సీగా పోటి నుండి విత్ డ్రా

jaggareddy

jaggareddy

MLA Jaggareddy : ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంత్రి హరీష్ రావుకు ఓ ఆఫర్ ప్రకటించారు.. ( jaggareddy on harish rao ) ఆర్ధిక మంత్రిగా ఉన్న హరీష్ రావు మెదక్‌లోని ప్రతి నియోజవర్గానికి 2వేల కోట్లు అభివృద్ది నిధులు విడుదల చేస్తే.. ఆయన భార్య నిర్మాల రెడ్డిని పోటి నుండి తప్పిస్తానని అన్నాడు.

ఇంకా చదవండి ...

మెదక్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోరు రసవత్తరంగా మారింది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సరైన బలం లేకున్నా ఆపార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి భార్య నిర్మలా రెడ్డిని బరిలోకి దింపారు. ( jaggareddy on harish rao ) దీంతో అక్కడ పోరు ఉత్కంఠగానే మారింది. వాస్తవానికి ఉమ్మడి మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ ఎదురులేని పరిస్థితి ఉంటుంది. మంత్రి హరీష్ రావుతో పాటు సీఎం కేసిఆర్‌లు సైతం ఆ జిల్లాకు చెందిన వారు కావడంతో ఆ పార్టీకి నల్లేరు మీద నడకేనని భావించారు.( jaggareddy on harish rao ) దీనికి తోడు అటు బీజీపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలు పోటికి దూరంగా ఉంటాయనే సంకేతాలు ఇచ్చినా... కాంగ్రేస్ పార్టీ అనుహ్యంగా ఖమ్మంతోపాటు మెదక్ జిల్లాలో పోటి చేస్తోంది. దీంతో టీఆర్ఎస్ పార్టీకి కొంత కష్టతరంగానే మారిని పరిస్థితి కనిపిస్తోంది.

ఈ క్రమంలోనే ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంత్రి హరీష్‌ రావుపై పలు విమర్శలు చేయడంతోపాటు ఓ ఆఫర్‌ను కూడా ప్రకటించారు. గాంధీభవన్‌లో మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గోన్న జగ్గారెడ్డి మంత్రి హరీష్ రావు జిల్లా నుండి ఆర్ధిక మంత్రిగా ఉన్నా నిధులు తీసుకువచ్చి అభివృద్ది చేయడంలో విఫలం అయ్యారని విమర్శించారు. ( jaggareddy on harish rao ) ఇక తెలంగాణ ఏర్పాటు తర్వాత స్థానిక నేతలకు పదవులు వచ్చాయి.. కాని.. వాళ్లకు ఎలాంటీ పవర్ లేదని వ్యాఖ్యానించారు. ఇక మంత్రి హరీష్ రావు ఎన్నికలు వస్తేనే జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటారని విమర్శించారు. ఈ క్రమంలోనే గత రెండు సంవత్సరాలుగా జడ్పీటిసీలు, ఎంపీటీలతో మాట్లాడని మంత్రి హారీష్ రావు ఇప్పుడు ఎన్నికలు రాగానే వారితో మాట్లాడుతున్నారని విమర్శించారు.



ఇది చదవండి  : ఒక్క సీటైనా గెలవాలి... కరీంనగర్‌లో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్ధులు ఏకతాటిపైకి .. ?


ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతోపాటు పార్టీ అధికారంలోకి వస్తే.. జిల్లాకు 20వేల కోట్లు అభివృద్ది నిధులు తీసుకువస్తానని చెప్పారు. ఇక ఆర్థిక మంత్రిగా ఉన్న హరీష్ రావు జిల్లాలోని ప్రతి నియోజవర్గానికి 2 వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని.. అలా చేసిన పక్షంలో తన భార్య నిర్మలా రెడ్డిని పోటి నుండి విత్ డ్రా చేయిస్తానని అన్నారు. ( jaggareddy on harish rao ) ఇక స్థానిక ప్రజాప్రతినిధులకు సరైన గౌరవం లేదని.. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి ని గెలిపిస్తే..స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల విలువ పెరుగుతుందని అన్నారు.. ( jaggareddy on harish rao ) కాంగ్రెస్ అభ్యర్ధి ని పెట్టడం వల్లనే ..హరీష్ రావు తమ పార్టీ ఓటర్లకు ఫోన్ లు చేస్తున్నాడని అన్నారు...కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పార్టీని గెలిపించి రాజా బతుకు బతుకుతారో...టిఆర్ఎస్ ను గెలిపించి బానిస బతుకు బతుకుతారో మీరే తేల్చుకొండని జగ్గారెడ్డి అన్నారు..

Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News

First published:

Tags: Harish Rao, Jaggareddy, Medak

ఉత్తమ కథలు