Jaggareddy on Revanth reddy : నాదే తప్పు... జగ్గారెడ్డి వ్యాఖ్యలపై హైకమాండ్ రంగంలోకి..

జగ్గారెడ్డి (ఫైల్ ఫోటో)

Jaggareddy on Revanth reddy : కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మధ్య చెలరేగిన వివాదం టీ కప్పులో తుఫానులా తేలిపోయింది. మీడియా ముఖంగా తాను చేసిన వ్యాఖ్యలు తప్పేనంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒప్పుకున్నారు. ఇక ముందు రేవంత్ రెడ్డితోపాటు కలిసి పని చేస్తానని ఆయన చెప్పారు.

  • Share this:
    తెలంగాణ కాంగ్రేస్ ( Telangana congress) పార్టీలో జరుగుతున్న పరిణామాలను హైకమాండ్ క్షుణ్ణంగా పరిశీలిస్తుందా.. అందుకే ఎప్పుడు వివాదాలు జరిగినా వెంటనే రంగంలోకి దిగి పరిష్కరిస్తుందా.. గతంలో వ్యక్తిగత స్వేచ్చకు ఎక్కువ ప్రయారిటిని ఇచ్చిన పార్టీ ఇప్పుడు ఆ స్ట్రాటజీని మార్చుకున్నట్టు కనిపిస్తుంది. ఏన్ని పరిణామాలు ఎదురైనా పార్టీ పటిష్టత కోసం పోరాడే వారికి మద్దతు ఇచ్చేందుకు పావులు కదుపుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఉన్న అసంతృప్తుల తోపాటు సీనియర్ నేతలను సైతం ఎప్పటికప్పుడు కట్టడి చేస్తున్నట్టు సంకేతాలను ఇస్తున్నారు.

    ఈ నేపథ్యంలోనే గత రెండు రోజులుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ,(jaggareddy) పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో మరోసారి పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. దీంతో వెంటనే హైకమాండ్ రంగంలోకి దిగింది. జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలను క్షుణ్ణంగా పరిశీలించింది. ఒక్క రోజు తేడాలోనే సమస్యను సద్దుమణిగేలా చేసింది.

    ఇది చదవండి : జలశక్తి మంత్రితో సీఎం కేసిఆర్ భేటి... నీటీ వివాదలపై చర్చ..


    ఈ క్రమంలోనే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలను పార్టీ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ ఆరా తీశారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలపై నేడు జరిగే సమావేశంలో చర్చించాలని సూచించారు. కాగా అంతకు ముందే పార్టీ అంతర్గత విషయాలను బహిరంగంగా మాట్లాడడంతో పాటు మీడియాలో(media) చర్చించకూడదని ఆయన గతంలోనే పార్టీ నేతలకు సూచించారు.అయితే వాటిని పక్కన బెట్టి జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడడంపై పార్టీ నేతలు సీరియస్ అయ్యారు.

    ఈ నేపథ్యంలోనే పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై (revanth reddy) చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. మీడియా ముఖంగా తాను చేసిన చేసిన వ్యాఖ్యలు తప్పేనని ఆయన ఒఫ్పుకున్నారు. ఇందుకు సంబంధించి పార్టీకి క్షమాపణ చెప్పానని అన్నారు. ఇక ముందు పార్టీలో కలిసి పని చేస్తామని చెప్పారు.రేవంత్ రెడ్డి తాను సోదరుల లాంటి వాళ్లమని చెప్పారు. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను ఆయన సమర్ధించారు.

    పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక సమయంలో కూడా రేవంత్ రెడ్డిపై వ్యతిరేక పవనాలు వీచాయి. ఎంపీ కొమటి రెడ్డి వెంకట్ రెడ్డి (mp komatireddy veenkat reddy) సైతం రేవంత్ రెడ్డి నియాయకం పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాను పార్టీలో కొనసాగినా.. ఇక తన నియోజకవర్గానికే పరిమితమవుతానుంటూ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే డబ్బులు తీసుకుని టీపీసిసి ఇచ్చారంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అప్పుడు కూడా పార్టీ హైకమాండ్ ఎంపీ కోమటి రెడ్డితో చర్చించింది. ఇలాంటీవి పునరావృతం కాకుండా ఉండాలని హెచ్చరించింది. దీంతో ఆయన అనాటి నుండి రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపించడం లేదు.. ఇక పార్టీలో సీనియర్ నాయకుడు హనుమంతరావు పరిస్థితి కూడా ఇలాగే కనిపించింది. ఆయన కూడా కొద్ది రోజులు రేవంత్ రెడ్డిని విమర్శించినా... ఆ తర్వాత చల్లబడ్డాడు.

    మొత్తం మీద రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఏక చత్రాధిపత్యం దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. పార్టీలో ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించడంతో పాటు అంతర్గత విభేదాలు తలెత్తకుండా ఇటు రాష్ట్ర నాయకత్వంతోపాటు కేంద్ర నాయకత్వం కూడా కృషి చేస్తోంది.
    Published by:yveerash yveerash
    First published: