హోమ్ /వార్తలు /తెలంగాణ /

MLA Jaggareddy : నన్ను ఎందుకు పిలవలేదు..? ఏఐసీసీకి లేఖ రాసిన జగ్గారెడ్డి..

MLA Jaggareddy : నన్ను ఎందుకు పిలవలేదు..? ఏఐసీసీకి లేఖ రాసిన జగ్గారెడ్డి..

జగ్గారెడ్డి ఫైల్ ఫోటో

జగ్గారెడ్డి ఫైల్ ఫోటో

MLA Jaggareddy : హుజూరాబాద్ ఫలితాల సమీక్షపై తనను పార్టీ హైకమాండ్ పిలవకపోవడం వెనక అనుమానాలు కల్గుతున్నాయని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.. తనను పార్టీ ఆహ్వనించకపోయినా.. ఎన్నికల పరిణామాలపై ఢిల్లీకి లేఖ రాశారు.

ఇంకా చదవండి ...

ఓ వైపు హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీలో స్కానింగ్ జరుగుతుంటే మరోవైపు ఆపార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి ఎపిసోడ్ మరింత వివాదానికి దారి తీస్తోంది. పార్టీ బాధ్యులను ఢిల్లీకి పిలిచిన హైకమాండ్ పార్టీ కరీంనగర్ ఇంచార్జ్‌గా ఉన్న జగ్గారెడ్డికి ఆహ్వానం అందలేదు.. దీంతో ఆయన పలు అనుమానాలకు వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే ఢిల్లీలో హుజూరాబాద్ ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ పరాభావంపై సమీక్ష జరుగుతున్నందున ఏఐసీసీకి లేఖ రాశారు. లేఖలో పలు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు జరిగిన పరిమాణాలపై ఆయన వివరించారు. ఇందులో భాగంగానే.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు పూర్తిగా బీజేపీకి షిఫ్ట్ అయిందని ఆయన పేర్కొన్నారు. మూడు నెలలకు ముందే వెంకట్‌ను అభ్యర్థిగా ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. స్థానిక అభ్యర్థిని ఎందుకు ఎంపిక చేయలేదన్నారు. వెంకట్‌కు ఆర్థిక బలం లేదన్న వాస్తవం రేవంత్’కు, భట్టికి ఇద్దరికి తెలుసుని పేర్కొన్నారు... అయినా వారిద్దరూ వెంకట్‌కు ఆర్థిక సహాయం ఎందుకు చేయలేదని అన్నారు... కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ బీజేపీకి ఎందుకు షిఫ్ట్ అయిందని, దీనికి బాధ్యులు ఎవరన్నారు. అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడం వల్ల పార్టీకి నష్టం జరిగిందన్నారు.

ఇది చదవండి : ఫేస్‌బుక్‌లో అందమైన ఫోటో.. టెమ్ట్ అయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. కట్ చేస్తే.


ఇవే ప్రశ్నలు తాను పీఏసీ సమావేశంలో లేవనెత్తానన్నారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా తాను మీడియాలో మాట్లాడితే కొందరు తప్పుపట్టారన్నారు. ఈ రోజు ఢిల్లీ వార్ రూమ్‌లో జరుగుతున్న విషయాలు ఎలా బయటకు వచ్చాయని ఆయన ప్రశ్నించారు. వార్ రూమ్ విషయాలు ఇలా బయటకు చెప్పడం కరెక్టా అని ఆయన నిలదీశారు.

మరోవైపు హుజురాబాద్ బై పోల్ సమీక్షకు తనను పిలువకపోవడంపై లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇంఛార్జిగా ఉన్న తనకు ఆహ్వానించకపోవడం పై అనుమానం కలుగుతోందిని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా ఢిల్లీలో హుజూరాబాద్ ఉప ఎన్నికలతో పాటు పార్టీలో ఉన్న అసమ్మతి వర్గంతో పాటు , పార్టీ కోవర్టులు, నేటి వరకు వారు చేసిన ఆరోపణల సీడిలను సైతం తీసుకువెళ్లినట్టు సమాచారం.

ఇది చదవండి  : ఖమ్మం నగరానికి మరో మణిహారం.. పర్యాటకులకు మరింత అనుభూతి..!


అయితే హుజూరాబాద్ సమీక్షలో కూడా ఆయా పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో పాటు బట్టి విక్రమార్కపై ఏఐసీసీ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఫైర్ అయినట్టు లీకులు వచ్చాయి. ఈటల విషయంలో మాట మారుస్తున్నావంటూ ఆయన ఫైర్ అయినట్టు తెలుస్తోంది. ఆయన్ను కాంగ్రెస్ పార్టీలోకి వద్దని ఇప్పుడు తీసుకుంటే బాగుండేదని , కొంతమంది నేతలు నిరాకరించడం వల్లే తీసుకురాలేక పోయామని అనడంతో ఈ వివాదం తెరపైకి వచ్చినట్టు సమాచారం. మొత్తం మీద రాహుల్ సమక్షంలో జరుగుతున్న సమీక్షలోనైనా భవిష్యత్‌ పార్టీ కాలాపాలపై పార్టీ నేతలు దృష్టి సారిస్తారా లేక అంతర్గత కుమ్ములాటలతోనే పార్టీని నెట్టుకువస్తారా అనేది వేచిచూడాలి.

First published:

Tags: Jaggareddy, TS Congress

ఉత్తమ కథలు