హోమ్ /వార్తలు /తెలంగాణ /

తలసాని నోరు అదుపులో పెట్టుకో.. ఎవరి ఊరికి వాడే పటేల్.. జగ్గారెడ్డి వ్యాఖ్యలు

తలసాని నోరు అదుపులో పెట్టుకో.. ఎవరి ఊరికి వాడే పటేల్.. జగ్గారెడ్డి వ్యాఖ్యలు

జగ్గారెడ్డి (ఫైల్ ఫోటో)

జగ్గారెడ్డి (ఫైల్ ఫోటో)

మాకు తలసాని వాడిన భాష రాదని చెప్పారు. మా దగ్గర అందరూ చదువుకున్నవాళ్లు ఉన్నారని, మా సమస్య అదే. మీ సంగతంతా మాకు తెలుసు. తలసాని పహిల్వాన్ గిరి చేస్తే తట్టుకునే శక్తి నాకు లదేని, హైదరాబాద్‌లో తిరగనీయకపోతే దాచుకుంటామని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇంకా చదవండి ...

‘ఎవరి ఊరికి వాడే పటేల్.. మళ్లీ మళ్లీ మాట్లాడితే చాలా చరిత్రే ఉంది. అది బయటపెడతాం. మా నాయకులకు జోలికి వస్తే సహించేది లేదు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు’ అంటూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై విరుచుకుపడ్డారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు దయతో లీడర్ అయిన తలసాని, తిన్నింటి వాసాలు లెక్కపెడతారని ఘాటుగా వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో తలసాని హవా నడిస్తే.. సంగారెడ్డికి వస్తే నా హవా నడుస్తుందని, మాకు తలసాని వాడిన భాష రాదని చెప్పారు. మా దగ్గర అందరూ చదువుకున్నవాళ్లు ఉన్నారని, మా సమస్య అదే. మీ సంగతంతా మాకు తెలుసు. తలసాని పహిల్వాన్ గిరి చేస్తే తట్టుకునే శక్తి నాకు లదేని, హైదరాబాద్‌లో తిరగనీయకపోతే దాచుకుంటామని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లాక్‌డౌన్ విషయంలో ప్రభుత్వానికి పూర్తిగా సహకరించామని, తామెప్పుడు రాజకీయ విమర్శలు చేయలేదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ వన్ మ్యాన్ షో చేస్తున్నారని, టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ డమ్మీనేనని చెప్పారు. కేసీఆర్ దగ్గర మాట్లాడే దమ్ము తలసానికి ఉందా అంటూ ప్రశ్నించారు.

First published:

Tags: CM KCR, Jaggareddy, Talasani Srinivas Yadav