ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుపై తెలంగాణ హైకోర్టు (Telangana High Court)కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసు సీబీఐ విచారణకు హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో అచ్చంపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (MLA Guvvala Balaraju) హైకోర్టు తీర్పుపై మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు సీబీఐకి ఇస్తే తాము ఎందుకు భయపడతామని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను, ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారని గువ్వల ఆరోపించారు. దీనిపై మేము సుప్రీంకోర్టుకు వెళ్తాము. సీబీఐ విచారణకు ఓకే చెబితే ప్రజాస్వామ్యాన్ని అగౌరవపర్చడమే అని అన్నారు.
ఫిర్యాదుదారున్నీ దొంగే అన్నట్టు చిత్రీకరిస్తున్నారు..
ఇక్కడ ఫిర్యాదుదారున్ని దొంగే అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని గువ్వల బాలరాజు (MLA Guvvala Balaraju) ఆరోపించారు. న్యాయపరంగా తమకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటామని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ముందుకు సాగుతాం. మాకు ఎటువంటి భయం లేదు. ఈ క్రమంలో పలు ప్రశ్నలను ఎమ్మెల్యే లేవనెత్తారు. ఈ కేసును సిట్ (Special investigation Team) విచారించే క్రమంలో బీజేపీ నేత బిఎల్ సంతోష్ విచారణకు ఎందుకు సహకరించలేదని ఆయన ప్రశ్నించారు. సిట్ నోటీసులు ఇస్తే హైకోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకున్నారని గువ్వల బాలరాజు (MLA Guvvala Balaraju) విమర్శలు చేశారు.
సీబీఐ, ఈడీలను కేంద్రం జేబు సంస్థలుగా వాడుకుంటుంది. దుర్మార్గమైన పాలన నడిపిస్తున్న కేంద్రంపై పోరాటం చేస్తామని అన్నారు. తెలంగాణ సర్కార్ ను కూల్చడానికి ఎవరు ప్రయత్నించారో అందరికీ తెలుసని, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ తమను ఇబ్బంది పెడితే సహించేది లేదని అన్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు (MLAa Poaching Case) కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. మొదట ఈ కేసును సిట్ (Special Investigation Team) దర్యాప్తు చేసింది. ఆ తరువాత జరిగిన పరిణామాలతో సీబీఐ (Central Burew Of Investigation) కి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు (Telangana High Court) సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. అయితే సీబీఐ (Central Burew Of Investigation) విచారణ అవసరం లేదని ప్రభుత్వం సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వ అప్పీల్ పై విచారణ జరిపిన కోర్టు సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టు వెళ్లే యోచనలో ఉన్నట్టు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BRS, Telangana, Telangana High Court, TRS MLAs Poaching Case