బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసన కార్యక్రమాలు కొనసాగుతుంటే మరోవైపు ఆ పార్టీ నేతలు సైతం నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి కిషన్ రెడ్డితోపాటు ఎమ్మెల్యే ఈటల రాజేందర్లు బండి సంజయ్‌లు కరీంనగర్ జైల్లో పరామర్శించారు. ఆ తర్వాత పోలీసుల చేతిలో గాయపడ్డ కార్యకర్తలను సైతం పరామర్శించి వారికి భరోసా కల్పించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన నేతలు కరీంనగర్ పోలీసులపై మండిపడ్డారు. ముఖ్యంగా సీపి సత్యనారాయణ తన విధులు మరచి రాష్ట్ర ప్రభుత్వం డైరక్షన్లో పని చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు ఏక పక్షంగా చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మరోవైపు రానుంది బీజేపీ ప్రభుత్వమేనన్న విషయాన్ని సీపి గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. ఆయన ఓ కానిస్టేబుల్ ఉద్యోగం నుండి సీపీ విధుల వరకు ఆయన వ్వవహరించి ఓ బానిస వలే పని చేస్తున్నారని ఆరోపించారు.
No Lockdown : కర్ఫ్యూ ,లాక్డౌన్ ఉండదు..! వాళ్లపై చర్యలు..! హెల్త్ డైరక్టర్.. ఎందుకంటే
ఈ క్రమంలోనే ఇంట్లో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే చర్యలు తీసుకుని దీక్ష చేస్తున్న బండి సంజయ్ పై దాడి చేసి శత్రువుల్లాగా వ్యవహరించారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. రానున్న ప్రభుత్వం తమదేనన్న విషయం గుర్తుపెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు.
ఇక కోవిడ్ నిబంధనలు కేవలం బీజేపీకే వర్తిస్తాయా అంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పోలీసులను ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలు ధర్నాలు, రాస్తారోకోలు చేసిన పట్టించుకోని పోలీసులు కేవలం బీజేపీనే టార్గెట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏ నిబంధనల మేరకు బీజేపీ కార్యాలయంపై దాడి చేశారని ఆయన ప్రశ్నించారు. అక్రమ కేసులకు భాజపా భయపడదు. ధర్నాచౌక్‌లో సీఎం ఆందోళన చేయవచ్చు.. ప్రతిపక్షాలు చేయకూడదా? తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఇంత అణిచివేత లేదు. ఇలాంటి రాచరిక, నియంతృత్వ పాలన కోసమే ఉద్యమం చేశామా అంటూ దుయ్యబట్టారు.
Murder : ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి.. కొడలిని పరుగెత్తించి హత్య చేసిన మామ..
ఇక దిల్లీలో ఏడాది పాటు రైతులు ఉద్యమం చేసినా కేంద్రం అడ్డుకోలేదని పైగా వారికి అన్ని సౌకర్యాలు కల్పించామని అన్నారు. ముఖ్యంగా బీజేపీ నేతలను కేసీఆర్ ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తోంది. కొవిడ్ నిబంధనల సాకుతో తప్పుడు కేసులు పెడుతున్నారని పోలీసుల తీరుపై ఆయన మండిపడ్డారు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Eetala rajender, Kishan Reddy