మంత్రి కేటీఆర్ కొడుకు హిమన్షుపై, తీన్మార్ మల్లన్న పెట్టిన ఒపినియన్ పోల్ రాజకీయ రణరణంగానికి దారి తీస్తోంది. ఇప్పటికే ఆ పోల్‌పై మంత్రి కేటిఆర్‌తో పాటు ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు. ఇక వారికి మద్దతుగా వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తోపాటు బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు ఖండించారు.
ఈ క్రమంలోనే టీఆర్ఎస్ నేతలు మల్లన్నపై విరుచుకుపడ్డారు. మధ్యాహ్నం టీఆర్ఎస్ కార్యాలయంలో మాట్లాడిన ఎమ్మెల్యే బాల్కసుమన్ మల్లన్న ఘటైన పదజాలంతో విమర్శించారు. ఇంట్లో చదువుకుంటున్న పిల్లలను బయటకు తీసుకురావడంపై ఆయన మండిపడ్డారు. ఇక తీన్మార్ మల్లన్నకు నిన్న రాత్రి రెండు చెంప దెబ్బలు పడ్డాయని.. చెంప దెబ్బలు కాదు భవిష్యత్‌లో ఇలాంటీవి కొనసాగితే.. చెప్పు దెబ్బలు కూడా పడతాయాని హెచ్చరించారు. ఈ క్రమంలోనే పార్టీ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి కుటుంబ సభ్యులపై వ్యాఖ్యలు చేస్తే ఆయా పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టడడంతో పాటు ఆందోళనలను నిర్వహించాలని చెప్పారు.
అయితే బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడిన సోషల్ మీడియాలో వారిపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇలా తానపై కూడా ఫేక్ అకౌంట్ల ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనకు అదనపు ఆస్తులు ఉన్నట్టు బండి సంజయ్ నిరూపించాలని డిమాండ్ చేశారు ఎన్నికల అఫిడవిట్లో తెలిపిన వాటి కంటే అదనంగా ఒక్కరూపాయి నిరూపించాలని లేదంటే బండి సంజయ్ బట్టలు ఊడదీసి కొడతామని హెచ్చరించారు. ఇక గతంలో కూడా పశ్చిమ బెంగాల్‌తో పాటు తమకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాలపై ఇలాంటీ ప్రచారాలు చేసిందని ఆయన గుర్తు చేశారు.. మరోవైపు రాష్ట్ర డీజీపీ సైతం ఇలాంటీ తప్పుడు ఆరోపణలపై సరైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యేలు, ఎంపీలను రక్షించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని అన్నారు.
మరోవైపు హిమాన్షు సంఘటనపై టీఆర్ఎస్ నాయకులు తీన్మార్ మల్లన్న పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఇదే అంశంపై తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌కు గురైందని తీన్మార్ మల్లన్న చెబుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద బీజేపీ, టీఆర్ఎస్ల మధ్య పరిపాలన సంబంధమైన అంశాలతో పాటు కుటుంబపరమైన అంశాలు కూడా పతాకశీర్షికల్లోకి ఎక్కుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో ఇరు పార్టీల మధ్య విమర్శలు ఏస్థాయికి చేరతాయో వేచి చూడాలి.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.