చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. బాల్క సుమన్ తండ్రి, మెట్‌పల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్క సురేష్ శుక్రవారం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. బాల్క్ సురేష్ మృతిపట్ల పలువురు టీఆర్‌ఎస్ పార్టీ నేతలు సంతాపం తెలిపారు. బాల్క సుమన్ తండ్రి బాల్క సురేష్ మరణం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. మెట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేసిన సురేష్ టీఆర్ఎస్ పార్టీ క్రియాశీల నాయకుడిగా చురుకైన పాత్రపోషించారని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే సుమన్‌ను సీఎం కేసీఆర్ ఫోన్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా సుమన్‌ను ఆయన ఓదార్చారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థి నేతగా బాల్క సుమన్ చురుకైన పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే ఆయనకు టీఆర్‌ఎస్ అగ్ర నాయకుడు కేటీఆర్‌తో పరిచయం ఏర్పడింది. ఇక, 2014 ఎన్నికల్లో బాల్క సుమన్.. పెద్దపల్లి లోక్‌సభ నియోజకర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు శాసనసభ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన సుమన్.. ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత సుమన్‌ను ప్రభుత్వ విప్ పదవి వరించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balka Suman, CM KCR