Home /News /telangana /

MISSION PANI TELANGANA JALA MANDALI MD DANA KISHORE ATTENDS JALA SHAKTI ABHIYAN REVIEW MEETING IN DELHI SK

Mission Paani: ప్రతి నీటి బొట్టునీ ఒడిసిపట్టాలి...జలమండలి పిలుపు

న్యూస్ 18 క్రియేటివ్

న్యూస్ 18 క్రియేటివ్

Mission Pani | మంచినీటిని పొదుపుగా వాడడం, ఇంకుడుగుంతలను నిర్మించుకోవడం వంటి అంశాలపై హైదరాబాద్ నగరవాసులకు కొన్నేళ్లుగా అవగాహన కల్పిస్తున్నట్లు జలమండలి ఎండీ వెల్లడించారు.

    ప్రతీ నీటి చుక్కనీ పొదుపుగా వాడుకోవాలని, ప్రతి వర్షపు బొట్టునీ ఒడిసి పట్టుకోవాలని పిలుపునిచ్చారు హైదరాబాద్ జలమండలి ఎండీ దాన కిశోర్. అప్పుడే భావి తరాలకు నీటి అవసరం తీరుతుందని..లేదంటే నీటి ఎద్దడితో తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటారని అభిప్రాయపడ్డారు. సోమవారం ఢిల్లీలో జరిగిన జలశక్తి అభియాన్ సమీక్ష, వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ జలమండలి నూతనంగా తీసుకువచ్చిన సంస్కరణలు, వాటి ఫలితాలను వర్క్ షాపులో వివరించారు. మంచినీటిని పొదుపుగా వాడడం, ఇంకుడుగుంతలను నిర్మించుకోవడం వంటి అంశాలపై హైదరాబాద్ నగరవాసులకు కొన్నేళ్లుగా అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

    నీటిని పొదుపు చేసేందుకు హైదరాబాద్‌లో 2016 నుంచి కార్యక్రమాలు చేపడుతున్నాం. 2016లో వంద రోజుల కార్యాచరణ, 2017లో జలభాగ్యం, 2018లో జలం-జీవం, 2019 లో వాక్ కార్యక్రమాలు నిర్వహించాం. నగరవాసులకు, విద్యార్థులకు మంచినీటి పొదుపుపై అవగాహన కల్పించేందుకు దేశంలోనే రెండవ థీమ్ పార్కును హైదరాబాద్‌లో ఏడాది క్రితం నిర్మించాం. మంచినీటిని ఏవిధంగా పొదుపుగా వాడాలి, వాననీటిని ఎన్ని విధాలుగా ఓడిసి పట్టవచ్చో అందులో అర్ధమయ్యే రీతిలో వివరిస్తున్నాం.
    దాన కిషోర్

    జల్‌శక్తి అభియాన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వర్క్ షాపుకు కేబినేట్ సెక్రెటరీ ప్రదీప్ కుమార్ సిన్హా అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో తాగునీరు మరియు పారిశుద్ద్య శాఖ సెక్రెటరీ పరమేశ్వర్ అయ్యర్, హౌసింగ్ మరియు అర్బన్ అఫైర్స్ శాఖ సెక్రెటరీ దుర్గా శంకర్ మిశ్రాలు పాల్గొన్నారు.



    First published:

    Tags: Hyderabad, Mission paani, Mission pani, Save water, Water conservation, Water Crisis

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు