Mission Paani | మాదారంలో ఇంటింటికీ ఇంకుడుగుంతలు..

ప్రతి నీటి బొట్టు ఎంతో విలువైనదని, దాన్ని వృధా చేయకూడదని జలశక్తి బృందం వారికి సూచించింది. ప్రతి బోర్‌వెల్‌ దగ్గర ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని సూచించారు.

news18-telugu
Updated: August 25, 2019, 10:54 PM IST
Mission Paani | మాదారంలో ఇంటింటికీ ఇంకుడుగుంతలు..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: August 25, 2019, 10:54 PM IST
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన జలశక్తి అభియాన్ వేగంగా పనులు చేస్తోంది. జలశక్తి బృందం తెలంగాణలోని మాదారం గ్రామంలో పర్యటించింది. గ్రామ సభ నిర్వహించింది. గ్రామస్తులతో పాటు, గ్రామ పెద్దలతో కలసి ఓ సమావేశాన్ని నిర్వహించింది. ఎంపీటీసీ, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రతి నీటి బొట్టు ఎంతో విలువైనదని, దాన్ని వృధా చేయకూడదని జలశక్తి బృందం వారికి సూచించింది. ప్రతి బోర్‌వెల్‌ దగ్గర ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, ప్రతి ఇంట్లోనూ ఇంకుడు గుంతలు తవ్వాలని ఆదేశించారు. గుట్టల మీద నుంచి వచ్చే నీటిని నిల్వ చేసేందుకు చెక్ డ్యాంలు నిర్మించాలని గ్రామసభలో తీర్మానం చేసినట్టు మాదారం సర్పంచ్ సాగరికా మంగీలాల్ తెలిపారు.

First published: August 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...