#MissionPaani | నీటి సంరక్షణలో నిజామాబాద్ జిల్లా భేష్.. కేంద్రం ప్రశంస

Mission Paani | జలశక్తి యోజన పథకం అమలులో అత్యంత వేగంగా స్పందించిన నిజామాబాద్ జిల్లాను కేంద్ర ప్రభుత్వం అభినందించింది.

news18-telugu
Updated: July 8, 2019, 6:52 PM IST
#MissionPaani | నీటి సంరక్షణలో నిజామాబాద్ జిల్లా భేష్.. కేంద్రం ప్రశంస
నిజామాబాద్‌లో వాల్ పెయింట్స్ ద్వారా జలసంరక్షణపై ప్రజల్లో అవగాహన
  • Share this:
భవిష్యత్తులో వచ్చే నీటి సమస్యలను దృష్టి లో పెట్టుకొని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని జల శక్తి యోజన జాతీయ నోడల్ అధికారి, కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత శాఖ సంయుక్త కార్యదర్శి, సీఈఓ నికుంజ కిషోర్ సుంద రాయ్ అన్నారు.
జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో మూడు రోజుల పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీటి సంరక్షణకు ఉద్దేశించిన జల శక్తి యోజన కార్యక్రమంలో దేశంలోని 256 జిల్లాలను గుర్తించామన్నారు. జల సంరక్షణ కోసం అత్యంత వేగంగా స్పందించి.. ఇప్పటి వరకు తీసుకున్నచర్యలు, భవిష్యత్తులో తీసుకోబోయే చర్యలపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసిన నిజామాబాద్‌ను తాము తమ మొదటి పర్యటన కోసం ఎంచుకున్నట్టు చెప్పారు.

నీటిని పొదుపుగా వాడుకోవడం, వర్షపునీటిని ఒడిసి పట్టుకోవడం, భూగర్భ జలాలు పైకి రావడానికి తీసుకోవాల్సిన చర్యలు వృధా నీటిని తిరిగి ఉపయోగించడంలాంటి చర్యలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం అందజేసిన ప్రణాళిక బాగుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ పనులు నిర్వహించడానికి అవసరమైన నిధులను సమకూర్చడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ప్రైవేటు, ప్రభుత్వ, పబ్లిక్ భవనాలలో వర్షపునీటిని వృధా పోకుండా పొదుపు చేయడం ద్వారా భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని, ఈ విషయాలను ఒక ఛాలెంజ్‌గా తీసుకొని కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇందుకు ప్రజలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులను భాగస్వాములుగా చేసుకొని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో నీటి సంరక్షణకు మిషన్ కాకతీయ ద్వారా చేపట్టిన కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నట్లు తెలుస్తుందని, అదేవిధంగా మొక్కల పెంపకం, తెలంగాణకు హరితహారం ద్వారా వాతావరణ సమతుల్యానికి వర్షాలు కురవడానికి, గ్రీనరీ కి తోడ్పడుతుందని ఆయన ప్రశంసించారు.



(మహేందర్, నిజామాబాద్ ప్రతినిధి, న్యూస్‌18)
First published: July 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు