Jagityala : ఒకే వీధికి చెందిన ముగ్గురు యువతులు మిస్సింగ్.. చెరువులో శవాలుగా తేలారు.. !

Jagityala : ఒకే వీధికి చెందిన ముగ్గురు యువతులు మిస్సింగ్.. చెరువులో శవాలుగా తేలారు.. !

Jagityala : జగిత్యాలలో విషాదం చోటు చేసుకుంది. ఒకే వీధిలో అదృశ్యమైన ముగ్గురు మహిళల మిస్టరీ వీడిందీ.. అదృష్యమైన ముగ్గురిలో ఇద్దరు యువతుల మృతదేహాలు స్థానిక చెరువులో లభ్యమయ్యాయి. కాగా మరో యువతికోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

  • Share this:
    జగిత్యాలలో విషాదం చోటు చేసుకుంది. ఒకే వీధిలో అదృశ్యమైన ముగ్గురు మహిళల మిస్టరీ వీడిందీ.. అదృష్యమైన ముగ్గురిలో ఇద్దరు యువతుల మృతదేహాలు స్థానిక చెరువులో లభ్యమయ్యాయి. కాగా మరో యువతికోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

    జగిత్యాల జిల్లా ఉప్పరిపేటలో విషాదం(tragedy) చోటుచేసుకుంది. బుధవారం రోజున అదృశ్యమైన ముగ్గురు యువతు(Three young women were missing) ల్లో ఇవాళ ధర్మసముద్రం చెరువులో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో యువతి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా ఉప్పరిపేట గ్రామంలో ఒకే వీధికి చెందిన ముగ్గురు యువతులు వందన, మల్లిక, గంగాజల బుధవారం రోజున అదృశ్యమయ్యారు. (Three young women were missing). నిన్న సాయంత్రమైనా ఇంటికి రాకపోవడం వల్ల వారి తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. ఎంతకీ ఆచూకీ దొరకకపోవడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    ఇది చదవండి : వైఎస్ జగన్ నా శ్రేయోభిలాషి.. అందుకే వచ్చా..! సీఎంతో భేటీపై నాగార్జున క్లారిటీ..


    కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వీరి కోసం బుధవారం రోజంతా గాలించారు. ఈ ముగ్గురు బంధువులేనని స్థానికులు పోలీసులకు చెప్పారు.చివరకు.. గురువారం మధ్యాహ్నం.. ధర్మసముద్రం చెరువులో మృతదేహాలు(three young women found dead in a pond) తేలడం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ మృతదేహాలు వెలికితీసిన పోలీసులు వారిని.. అదృశ్యమైన యువతుల్లో గంగాజల, మల్లికలుగా గుర్తించారు. మరో యువతి వందన కోసం చెరువులో గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కారణాలేవి ఇంకా తెలియదని.. ముగ్గురు ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు
    Published by:yveerash yveerash
    First published: