Telangana: తెలంగాణ పోలీసులకు కొత్త సవాల్.. పెరిగిపోతున్న మిస్సింగ్ కేసులు

Telangana Police: నిన్న హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 13, సైబరాబాద్ పరిధిలో 11, రాచకొండ పరిధిలో 8 మిస్సింగ్‌ కేసులు నమోదు అయినట్లు పోలీసులు శాఖ పేర్కొంది.

news18-telugu
Updated: October 29, 2020, 9:40 PM IST
Telangana: తెలంగాణ పోలీసులకు కొత్త సవాల్.. పెరిగిపోతున్న మిస్సింగ్ కేసులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ పోలీసులకు మిస్సింగ్ కేసులు సవాల్‌గా మారుతున్నాయి. రాష్ట్రంలో ఈ రకమైన కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గడిచిన నాలుగు రోజుల్లోనే తెలంగాణలో 203 మంది మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. పోలీసుల అధికారిక వైబ్‌సైట్‌లో మిస్సింగ్ కేసుల వివరాలను పొందుపరిచింది. నిన్న ఒక్క రోజులోనే రాష్ట్రవ్యాప్తంగా 65 మంది అదృశ్యం అయినట్టు పోలీసులు ప్రకటించారు. నిన్న హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 13, సైబరాబాద్ పరిధిలో 11, రాచకొండ పరిధిలో 8 మిస్సింగ్‌ కేసులు నమోదు అయినట్లు పోలీసులు శాఖ పేర్కొంది.

ఈ నెల 26న 65 మిస్సింగ్‌ కేసులు, 27న 62 కేసులు, 28న 65 కేసులు ఈ రోజు 11 మిస్సింగ్‌ కేసులు నమోదు అయినట్లు వెబ్‌సైట్‌లో వెల్లడించింది. వివిధ కారణాలతో ఇళ్ల నుంచి వెళ్లిపోతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ మిస్సింగ్‌ కేసులపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. అయితే రాష్ట్రంలో అధికారిక మిస్సింగ్ కేసులతో పాటు అనధికారికంగా మరికొందరు అదృశ్యమవుతున్నారని తెలుస్తోంది. మిస్సింగ్ కేసుల్లో పోలీసుల వరకు వచ్చే కేసులు సంఖ్య తక్కువ అనే వాదన కూడా ఉంది.

కొందరు తమ వాళ్లు అదృశ్యమైన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడానికి ముందుకు రావడం లేదని... మిస్సింగ్ కేసులను చేధించడంలో జాప్యానికి ఇది కూడా ఓ కారణమని తెలుస్తోంది. సాధ్యమైనంత తొందరగా మిస్సింగ్ కేసులను పోలీసుల దృష్టికి తీసుకురావడం వల్ల.. తప్పిపోయిన వాళ్ల ఆచూకీని తొందరగా కనిపెట్టే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఇటీవల బాలుడు దీక్షిత్ రెడ్డి కిడ్నాప్, హత్య తరువాత అనంతరం.. మిస్సింగ్ కేసు అంశంపై పోలీసుల ఫోకస్ మరింతగా పెరిగింది.
Published by: Kishore Akkaladevi
First published: October 29, 2020, 9:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading