మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు : జైల్లో మారుతీరావు సోదరుడి ఉంగరాలు మాయం..

ప్రణయ్ హత్యకేసులో నిందితులు మారుతీరావు, అస్గర్ అలీ, మహ్మద్ బారీ(File)

శ్రవణ్ జైల్లో ఉన్న సమయంలో అతని చేతి ఉంగరాలను స్వాధీనం చేసుకుని భ్రదపరచగా.. ప్రస్తుతం అవి కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. జలంధర్ అనే జైలర్‌పై అనుమానం వ్యక్తం చేశారు.

  • Share this:
    గతేడాది మిర్యాలగూడలో ప్రణయ్ హత్యోదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. హత్య కేసులో ప్రధాన నిందితులు మారుతీరావు, అతని సోదరుడు శ్రవణ్ కుమార్‌లకు ఇటీవలే షరతులతో కూడిన బెయిల్ లభించింది. అయితే శ్రవణ్ కుమార్ చేతి ఉంగరాలు పోయాయని తాజాగా నల్గొండ జైలు అధికారులు వన్‌ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వాటి విలువ సుమారు రూ.6లక్షలు ఉంటుందని తెలిపారు. శ్రవణ్ జైల్లో ఉన్న సమయంలో అతని చేతి ఉంగరాలను స్వాధీనం చేసుకుని భ్రదపరచగా.. ప్రస్తుతం అవి కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. జలంధర్ అనే జైలర్‌పై అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
    First published: