హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mahabubnagar : మారని పంచాయితీ పెద్దలు , అత్యాచారానికి పరిహారంగా ఎకరం పోలం..

Mahabubnagar : మారని పంచాయితీ పెద్దలు , అత్యాచారానికి పరిహారంగా ఎకరం పోలం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Mahabubnagar :గద్వాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది..అలాంపూర్ మండలంలోని ఓ మైనర్ బాలిపై అత్యాచారం జరిగింది..అందుకు పరిహారంగా ఎకరం పొలం ఇచ్చేందుకు నిందితుడు ఒప్పుకున్నాడు..

  న్యూస్ 18 మహబూబ్ నగర్..

  సయ్యద్ రఫీ...MBNR

  గ్రామాల్లో పంచాయితీల పెద్ద మనుష్యులు ఇంకా మారని పరిస్థతి నెలకోంది. అభం శుభం తెలియని అమ్మాయిలపై అత్యాచారాలు జరుగినా..వాటికి విలువ కట్టే సంస్కృతికి ఇంకా చరమగీతం పాడలేని స్థితిలో ఉన్నారు. దీంతో పురుషాధిపత్యం చూపించే విధంగా గ్రామీణ పెద్దలు వ్యవహరిస్తున్నారు. దీంతో చాలమంది మహిళలపై అత్యచారాలు వెలుగులోకి రానిపరిస్థితి కనిపిస్తోంది. అయితే మారుతున్న కాలంలో కొంతమంది తల్లిదండ్రులు మాత్రం ధైర్యం చేసి బయటకు వస్తున్నారు. అలాంటప్పుడే కోన్ని అత్యాచార కేసులు బయటకు వస్తున్నాయి..

  తాజాగా మైనర్‌పై జరిగిన అత్యాచారం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జోగులంబ గద్వాల జిల్లా పరిధిలోని అలంపూర్ మండలం లో చోటు చేసుకుంది. తొమ్మిది సంవత్సరాల బాలిక ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా సమీపంలో నివాసముండే 35 సంవత్సరాలు ఓ వ్యక్తి, ఆ అమ్మాయిని అత్యాచారం చేశాడు ఆడుకుంటూ వెళ్లిన తమ కుమార్తె ఇంతకు రాకపోవడంతో వెతికిన బాలిక తల్లిదండ్రులు జరిగిన దారుణాన్ని తెలుసుకొని నిందితుని పట్టుకున్నారు.

  జరిగిన దారుణంపై గ్రామంలోని పంచాయితీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. దీంతో పంచాయితీ నిర్వహించిన పెద్దలు మాత్రలు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. అందుకు పరిహారంగా భాదితురాలి కుటుంభానికి ఎకరం పోలం ఇచ్చేందుకు ఒప్పించారు. అయితే ఈ పరిష్కారానికి భాదిత కుటుంభ సభ్యులు ఒప్పుకోకపోవడంతో విషయం బయటకు వచ్చింది.. పంచాయితీ అనంతరం బాలికి తల్లిదండ్రులు స్థానిక ఆలంపూర్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి పిర్యాధు చేశారు. కాగా నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Mahabubnagar, Telangana crime news

  ఉత్తమ కథలు