Home /News /telangana /

MINOR GIRL MURDER CASE ACCUSED WAS ARRESTED HER LOVER IS KILLER VRY

Vikarabad :ప్రియుడే హంతకుడు, సృహతప్పిపోయినా.. అత్యాచారం అందుకే ప్రాణాలు విడిచింది..

ప్తతీకాత్మక చిత్రం

ప్తతీకాత్మక చిత్రం

Vikarabad : వికారాబాద్ జిల్లాలో బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితున్ని జిల్లా పోలీసులు చేదించారు.. ఆమె ప్రియుడే హత్యకు కారణమని తేల్చారు.. మహేందర్ అనే నిందితున్ని మీడియా ముందు పెట్టారు.

    వికారాబాద్ జిల్లా పూడూరు మండలం అంగడిచిట్టంపల్లిలో సోమవారం జరిగిన పదవ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం, హత్య కేసును పోలీసులు చేధించారు. దీనికి కారణమైన ఆమె ప్రియుడు మహెందర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తమ ఇంట్లో స్నేహితులకు పార్టీ ఇచ్చిన మహెందర్ బాలికను తెల్లవారుజామున మూడున్నర గంటలకు ఇంటికి పిలిపించుకున్నట్టు పోలీసులు తెలిపారు.ఆ తర్వాత అప్పటికే తన స్నేహితులకు పార్టీ ఇచ్చిన మహెందర్ బాలిక రావడంతోనే ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడని అయితే ఆమె అందుకు అంగీకరించకపోవడంతో బలవంతంగా అనుభవించేందుకు ప్రయత్నాలు చేసినట్టు జిల్లా ఎస్పీ వివరించారు.

    ఈ క్రమంలోనే ఆమెను బలవంతంగా గొడకు విసిరి కొట్టడడంతో అక్కడే ఉన్న చెట్టుకు తాకి సృహతప్పి కిందపడిపోయిందని.. ఆ పరిస్థితుల్లో కూడా నిందితుడు ఆమెపై అఘాయిత్యం చేశాడని, ఈ సంధర్భంలోనే ప్రాణాలు కొల్పోయిందని జిల్లా ఎస్పీ వివరించారు. ఇక బాలిక చనిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక మహెందర్ అక్కడి నుండి నేరుగా ఇంటికి వెళ్లినట్టు చెప్పారు. కాగా ఈ హత్యలో ప్రియుడు మాత్రమే పాల్గొన్నట్టు చెప్పారు. ఇతరుల ప్రమేయం ఏది లేదని వివరించారు. కాగా నేడు నిందుతున్ని కోర్టులో హజరుపరచనున్నట్టు చెప్పారు. నిందితునికి త్వరగా శిక్షపడేందుకు ప్రయత్నాలు చేస్తామని చెప్పారు.

    CM KCR : కాసేపట్లో.. సీఎం కేసీఆర్ ఢిల్లీకి.. బేగంపేట నుండి ప్రత్యేక విమానంలో...కారణం ఇదే...

    కాగా హత్యకు ముందురోజు నిందితుడు మహెందర్ తన ఇంటి నిర్మాణంలో భాగంగా బోరుపడడంతో స్నేహితులను పిలిచి పార్టీ ఇచ్చినట్టు చెప్పారు. అయితే నిందితుడు మహెందర్‌కు డ్రింకింగ్ అలవాటు లేదని చెబుతున్నారు. కాని కామవాంఛ తీర్చుకునే ప్రయత్నంలోనే ఆమె ప్రతిఘటించడంతో తోపులాట జరిగి ఆమె సృహతప్పి చనిపోయినట్టు నిందితుడు అంగీకరించినట్టు పోలీసులు చెప్పారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Crime news, Vikarabad

    తదుపరి వార్తలు