MINOR GIRL MARRIAGES ARE BEING STOPPED BY OFFICIALS IN MAHABUBNAGAR VRY MBNR
Mahabubnagar : బాల్యవివాహాలపై ఉక్కుపాదం.. వేల పెళ్లిలకు ఫుల్స్టాప్ ఎక్కడంటే...
ప్రతీకాత్మక చిత్రం
Mahabubnagar : పెదరికం, నిరక్షరాస్యతతో మైనారిటీ తీరని బాలికలు అనేక మంది పెళ్లిపీటలు ఎక్కుతున్నారు.. అయితే బాల్య వివాహల సమాచారం తెలుసుకుంటున్న అధికారులు మాత్రం వాటిపై ఉక్కుపాదం మోపుతున్నారు.
తల్లిదండ్రుల కనుపాపలు గా ముద్దు ముద్దు మాటలతో చిలిపి చేష్టలతో కుటుంబంలో ఆనందాన్ని పంచే బాలికలు తగిన వయస్సు రాకముందే పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. పుస్తకాలు పట్టుకుని తోటి విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా పాఠశాలకు వెళ్లాల్సిన సమయంలో బాధ్యతలను మోసేందుకు భర్త చేయి పట్టుకొని అత్తవారింటి మెట్లు ఎక్కుతున్నారు...పేదరికం నిరక్షరాస్యత మరోవైపు కోవిడ్ తో ఎదురైన ఆర్థిక ఇబ్బందులతో ఆడిపాడే వయసులో చిట్టి తల్లులు తల్లిదండ్రులు బంధువులకు దూరమై పెళ్లిపీటలు ఎక్కుతున్నారు.
మైనారిటీ తీరకముందే 15 నుంచి 17 సంవత్సరాల వయసులోనే వారికి వివాహాలు చేసి తల్లిదండ్రులు తమ బాధ్యతలు చేసుకోవాలని చూస్తున్నారు.ఇలా ఉమ్మడి పాలమూరు జిల్లాలో నెలకు కనీసం 6నుంచి 10 వరకు పెళ్లిళ్లకు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో సమాచారం అందిన తర్వాత సంక్షేమ శాఖ అధికారులు పోలీసులు వెళ్లి ఆయా చోట్ల వేడుకలకు చేసిన ఏర్పాట్లను అడ్డుకుంటున్నారు. చాలా సందర్భాల్లో వివాహాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాక చివరి క్షణంలో తెలుసుకొని పెళ్లిళ్ల ను అవుతుండగా అధికారులపై బాలికల తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు తిరగబడుతున్నారని అధికారులు చెబుతున్నారు.
అయితే.. జిల్లాలోని ఓ గ్రామంలో బాల్యవివాహాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా రూ.లక్షలు వెచ్చించి పెళ్లి చేసుకుందామని అడ్డుతగలడం సరికాదని తల్లిదండ్రులు అధికారులను వ్యతిరేకించారు. ఆత్మహత్య చేసుకుంటామని అధికారులను బెదిరించారు. అయినా అధికారులు వినకుండా ఆ వివాహాన్ని అధికారులు అడ్డుకుని గ్రామ పెద్దల సమక్షంలో వారికి నచ్చజెప్పడంతో వివాహం రద్దు చేసుకున్నారు..
ఇలా గత మూడేళ్లలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో బాల్య వివాహాలను మహిళా సంక్షేమ శాఖ ద్వారా అడ్డుకున్న వివరాలు...మహబూబ్నగర్ .167. నాగర్కర్నూల్. 130. వనపర్తి .231 .జోగులాంబ గద్వాల .210. నారాయణపేట. 146. వివాహాలను ఆపినట్టు చెప్పారు.. ఇలా మూడేళ్లలో 884 పెళ్లిళ్ల ను అడ్డుకున్నట్టు సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు.. కాగా బాల్య వివాహాలకు సంబంధించి 181కు సమాచారం వచ్చిన వెంటనే అధికారులు వెంటనే చేరుకుని వాటిని ఆపుతున్నట్టు జిల్లా అధికారులు వెళ్లి చర్యలు చేబుతున్నట్టు చెబుతున్నారు..దీంతో బాల్య వివాహలపై తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించడంతో వివాహాలను ఆపే అవకాశం ఉంటుందని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.