Home /News /telangana /

Minor Girl pregnanat : తల్లిదండ్రులు లేని మైనర్ బాలికపై అఘాయిత్యం.. గర్భం దాల్చిన బాలిక

Minor Girl pregnanat : తల్లిదండ్రులు లేని మైనర్ బాలికపై అఘాయిత్యం.. గర్భం దాల్చిన బాలిక

తల్లిదండ్రులు లేని మైనర్ బాలికపై అఘాయిత్యం..

తల్లిదండ్రులు లేని మైనర్ బాలికపై అఘాయిత్యం..

Minor Girl pregnanat : నిజామాబాద్ జిల్లాలో మరో మైనర్ బాలిక పెళ్లి కాకుండానే గర్భవతి అయింది..కారకులు ఎవరైనా.. తల్లిదండ్రులు లేని ఆ బాలికను జిల్లా కేంద్రం లోని సఖీ కేంద్రానికి అధికారులు తీసుకువెళ్లారు.. మరోవైపు బాలికకు జరిగిన అన్యాయం పై పోలీసులు కేసు నమోదు చేసి ఆరా తీస్తున్నారు.

ఇంకా చదవండి ...
నిజామాబాద్ జిల్లా,
న్యూస్ 18తెలుగు ప్రతినిధి :పి మహేందర్,

నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలం లక్ష్మీ కిసాన్ ఫారం గ్రామానికి చెందిన పదహారేళ్ళ మైనర్ బాలిక గర్భం దాల్చింది.. ప్రస్తుతం బాలిక ఏడూ నెలల గర్భవతిగా అధికారులు నిర్థారించారు.. బాలిక గతంలో నివాసం ఉన్న ఊర్లోనే గర్భం దాల్చినట్లు సమాచారం..అయితే విషయం తెలుసుకున్న జిల్లా సఖి కేంద్రం అడ్మినిస్ట్రేటివ్ అధికారి బాను ప్రియ, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి చైతన్య కుమార్ సిబ్బంది తో కలిసి గ్రామానికి చేరుకొని కుటుంబ సభ్యులను విచారించారు. అనంతరం బాలికని సఖి కేంద్రానికి తరలించారు....

అయితే బాలిక పై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి వాసిగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. బాలిక తండ్రి వారం రోజుల క్రితం ప్రమాదంలో మృతి చెందగా తల్లి కూడా లేకపోవడంతో బంధువులు పోలీసులకు పిర్యాదు చేయాలని అధికారులు సూచించారు ..మరోవైపు బాలిక గర్భవతి అని తెలుసుకున్న కుటుంబ సభ్యులు గర్బం తీయించేందుకు కూడ యత్నించారు.. అయితే జిల్లా కేంద్రం లోని ఓ ప్రవేటు ఆసుపత్రి వైద్యులు గర్భం తొలగించడానికి లక్ష రూపాయలు ఖర్చవుతుంది అని చెప్పడంతో ఆ ఆలోచన విరమింప చేసుకున్నారు. దీంతో బాలికని గుట్టు చప్పుడు కాకుండ ఇంట్లొనే కుటుంబ సభ్యులు ఉంచారు...

దీంతో ఈ విషయం గ్రామ సర్పంచ్ దృష్టికి రావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. సర్పంచ్ వెంటనే జిల్లా అధికారులకు సమాచారం అందించడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాలిక బంధువులను అధికారులు, పోలీసులు విచారించారు.. ఈ సందర్బంగా సఖి కేంద్రం జిల్లా అధికారి భాను ప్రియ మాట్లాడుతూ బాలికని సఖి కేంద్రానికి తరలించి సురక్షితంగా ఉంచుతామని పేర్కొన్నారు. ఈ ఘటన పై మరిన్ని వివరాలు సేకరించి బాలికకి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు.. గ్రామాల్లో గాని పట్టణాల్లో గాని ఇలాంటి ఘటనలు జరగకుండా తల్లి తండ్రులు జాగ్రత్తలు వహించాలని ఆమె కోరారు. జిల్లాల్లో ఇలాంటి ఘటనలు జరిగితే టోల్ ఫ్రీ నెంబర్ 1098 ద్వారా తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
Published by:yveerash yveerash
First published:

Tags: Minor girl pregnant, Nizamabad

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు