Home /News /telangana /

Khammam : ప్రేమన్నాడు.. లొంగకపోతే రికార్డులు బయటపెడతానన్నాడు.. చివరకు ఆ యువతి... ?

Khammam : ప్రేమన్నాడు.. లొంగకపోతే రికార్డులు బయటపెడతానన్నాడు.. చివరకు ఆ యువతి... ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Khammam : ప్రేమ అన్నాడు.. లొంగకపోతే రికార్డులు బయటపడతాన్నాడు.. చివరకు ఆ యువతి... ? Khammam : చిన్న తనంలోనే కుటుంబ భారాన్ని భుజాన వేసుకుని జీవితాన్ని నెట్టుకువస్తున్న ఓ మైనర్ యువతిపై అదే సంస్థలో పనిచేసే మరో సీనియర్ కన్నుపడింది. పెళ్లైన ఓ వ్యక్తి ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఆ యువతిని లొంగదీసుకున్నాడు.. చివరకు ఆమె నిరాకరించినా.. వేధింపులు ఆపకపోవడంతో చివరికి ఆ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది.

ఇంకా చదవండి ...
  జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్‌, న్యూస్‌18 తెలుగు, ఖమ్మం జిల్లా

  తండ్రిలేని బాలికపై కోరిక తీర్చాలంటూ వేధింపులు... ప్రేమ పేరిట వేధింపులు ఆగడం లేదు. పైగా తాను ప్రేమిస్తున్నానని.. తన కోరిక తీర్చాలని అతను తరచూ వెంటబడుతుండడంతో తన అయిష్టాన్ని చెప్పుకోలేక.. అతని వత్తిడిని తట్టుకోలేక అసహాయ స్థితిలో ఉన్న బాలిక (minor girl )బలవంతంగా తనువు (suicide) చాలించింది. స్థానికంగా ఓ ఆసుపత్రిలో (hospital) నర్సుగా పనిచేస్తున్న బాలిక ఆత్మహత్య ఖమ్మంలో కలకలం సృష్టించింది. నిత్యం ఎక్కడ చూసినా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అమ్మాయిలపై ప్రేమ పేరిట వేధింపులు సాగుతునే ఉన్నాయి. కలచివేస్తున్న ఈ ఉదంతం తాజాగా చోటుచేసుకుంది.

  ఖమ్మం జల్లా (khammam ) తల్లాడకు చెందిన కుసుమరాజు వర్షిత చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. కుటుంబ పోషణ కోసం ఆమె ఖమ్మంలోని ఆరల్‌ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. అక్కడికి దగ్గరిలోనే ఉన్న అశ్విత ఉమెన్స్‌ హాస్టల్లో (womans hostel )ఉంటోంది. తండ్రి లేకపోయినా తల్లికి తోడుగా కుటుంబాన్ని లాక్కురావడానికి చదువు మానేసి సైతం ఆమె కష్టపడుతోంది. అయితే ఆమె పనిచేసే ఆసుపత్రిలోనే కృష్ణా జిల్లా (krishna district ) తిరువూరుకు చెందిన మల్లవరపు మధుకుమార్ పనిచేస్తున్నాడు. అప్పటికే పెళ్లి అయిన మధుకుమార్‌ వర్షితను ప్రేమించమని తరచూ వేధింపులకు పాల్పడుతున్నాడు. ఆమెతో తరచూ ఫోన్‌లు మాట్లాడుతూ.. మెసేజ్‌లు చేస్తూ ఉండేవాడు. ఆమెను తనతో గడపాలని, తన కోరిక తీర్చాలని వేధిస్తుండేవాడు.

  ఇది చదవండి :  హుజూరాబాద్‌లో హోరెత్తనున్న ప్రచారం.. ఇదిగో ప్రచారాన్ని నిర్వహించేది వీరే.. !


  ఇది చదవండి :  ఫేస్‌బుక్ సేవలు నిలిచిపోవడం వెనుక పెద్ద కుట్ర? సంచలన విషయాలు వెల్లడించిన ఫేస్‌బుక్ మాజీ ఉద్యోగిని


  ఆమె తిరస్కరించడంతో తాను మాట్లాడిన ఫోన్‌ రికార్డులను ( phone Records ) బయటపెడతానని బెదిరింపులకు పాల్పడేవాడు. దీంతో అతన్ని వదిలించుకోలేక, గట్టిగా తిరస్కరించలేక ఆమె మానసికంగా తీవ్ర వత్తిడికి లోనైంది. ఈ మధ్య కాలంలో అతని నుంచి తీవ్ర వత్తిడి రావడంతో ఇక చేసేది లేక ఆత్మహత్యకు పాల్పడింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రోగులకు ఇచ్చే స్టిరాయిడ్‌ ఇంజెక్షన్‌ను తీసుకుంది. ఆమె తన వేదనను స్నేహితురాలితో చెప్పుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. మధుకుమార్‌ వేధింపులతోనే మనస్తాపానికి గురికావడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆమె తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ( police ) మధుకుమార్‌పై పోక్సో చట్టం ( pocso ) కింద కేసు నమోదు చేశారు. ‌
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Crime news, Khammam, Suicide

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు